హోరాహోరీ: ఒకేసారి సినిమాలు విడుదల చేస్తున్న బాలయ్య, చిరు, ఎన్టీఆర్, వెంకీ

సంక్రాంతి పర్వదినం అంటేనే తెలుగు సినీ పరిశ్రమకు అతి పెద్ద పండగలాంటిది. ఆ సమయంలో చాలా సాధారణమైన సినిమాను విడుదల చేసినా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది. కలెక్షన్లు అలావస్తాయి. సంక్రాంతికి పిల్లలకు సెలవులు, పెద్దలకు నాలుగురోజులు సెలవులుండటంలాంటివన్నీ కలిసివస్తాయి.

మొన్న సంక్రాంతికి వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య డాకు మహారాజ్ సినిమాలు ఘనవిజయం అందుకోవడానికి కారణం పండగ సెలవులే. తిరిగి వచ్చే సంక్రాంతికి కలుద్దామని వెంకటేష్ ముందుగానే ప్రకటించారు. అయితే ఇంతవరకు సినిమా ఏదీ ప్రారంభం కాలేదు. కథలు వింటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. అయితే యువ దర్శకులు చెబుతున్న కథలను కూడా వింటున్నారు.

Chiranjeevi balakrishan venkatesh and junior ntr to compete for 2026 Sankranthi

నాలుగు నెలల్లో అనిల్ చుట్టేస్తాడు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్ అఖండ2పై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయదశమికి ఈ సినిమా విడుదల చేద్దామనుకున్నారు. అయితే గ్రాఫిక్స్ వర్క్, వీఎఫ్ఎక్స్ పనులన్నీ పెండింగ్ లో ఉండటంతో దీన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. అలాగే చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అనిల్ సినిమాను నాలుగు నెలల్లోనే తీయగలడు. ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. వెంకటేష్ సినిమా ప్రారంభమైతే అది కూడా సంక్రాంతికే రాబోతోందనేది ఖాయం.

ఎవరూ వెనక్కి తగ్గేలా లేరు
ఈ మూడు సినిమాలు కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రం కూడా జనవరి 9వ తేదీన విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూ.2వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాలనేది టార్గెట్. దీంతో 2026 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ పోటీపడనున్నారనేది ఖాయమైంది. ఇంతమంది స్టార్ హీరోలు ఒకేసారి వస్తే థియేటర్లు దొరకడం చాలా కష్టమవుతుంది. థియేటర్ నిర్వాహకులకు ఇది చాలా తలనొప్పిగా మారుతుంది. ఎవరు తమ సినిమాలను విడుదల చేస్తారు? ఎవరు వెనక్కి తగ్గుతారనేది కొంతకాలం తర్వాతే స్పష్టత వస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గేలా కనపడటంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+