మోహన్‌బాబు దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడిన చిరంజీవి
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి కుటుంబంతోపాటు మోహన్ బాబు కుటుంబానికి కూడా అదే స్థాయిలో ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో తమదైన ముద్రను ఈ ఇద్దరు నటులు వేశారు. పరిశ్రమలో ఇద్దరిదీ ఒకే తరహాలో ప్రయాణం ఉంటుంది. ముందుగా ప్రతినాయకుడిగా, సహనటుడిగా నటించిన వీరిద్దరూ తర్వాత కాలంలో కథానాయకులుగా ఎదిగారు. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ తో యువతను ఆకట్టుకొని సుప్రీంహీరోగా, తర్వాత మెగాస్టార్ గా అవతరించారు. తిరుగులేని ఆధిక్యతను పరిశ్రమలో పెంచుకున్నారు. మోహన్ బాబు కూడా హీరోగా మారిన తర్వాత ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. చిరంజీవి కొడుకు, తమ్ముడు వేసినంత ముద్ర మోహన్ బాబు కొడుకులు పరిశ్రమలో వేయలేకపోయారు.
ఆ సూపర్ స్టార్ నటించిన పాత్ర సినిమాకు ప్రాణం పోసింది
విలన్ గా నటిస్తున్న మోహన్ బాబు మధ్య మధ్యలో తన సొంత బ్యానర్ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అల్లుడుగారు సినిమాతో మోహన్ బాబు హీరోగా ఒక రేంజ్ కు వెళ్లారు. అక్కడి నుంచి వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఉన్నతమైన స్థాయిలో సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న తరుణంలోనే మరో సినిమా పెదరాయుడు చేశారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. భానుప్రియ, సౌందర్య, బ్రహ్మానందం తదితరులు నటించారు. పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ పోషించిన 20 నిముషాల పాత్ర సినిమాకు హైలైట్. పెదరాయుడిగా మోహన్ బాబు అద్భుతంగా సెట్ అయ్యారని చెప్పొచ్చు.

ఆ సినిమా ధాటికి బిగ్ బాస్ నిలవలేకపోయింది
ఈ సినిమా 1995 జూన్ 15న విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అదేరోజు మెగాస్టార్ చిరంజీవి నటించి బిగ్ బాస్ విడుదలైంది. పెదరాయుడు దెబ్బకు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడింది. రోజురోజుకు పెదరాయుడుకు ఆదరణ పెరగడం, ఘరానా మొగుడు రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి 39 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని పూర్తిచేసుకుంది. పెదరాయుడు ధాటికి బిగ్ బాస్ నిలవలేకపోయింది. ఈ సినిమా చిరంజీవికి పెద్ద డిజాస్టర్ గా మారడంలో పెదరాయుడు పాత్ర కూడా ఉంది. వ్రజోత్సవాల సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. బయట కార్యక్రమాల్లో కనిపించినప్పుడు ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడుకుంటున్నారుకానీ అదంతా పైపైనే అని అందరికీ అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications