Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముచ్చటగా మూడో పెళ్లి..?

ఈ రోజుల్లో విడాకులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది తమ వైవాహిక జీవితాలకు గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. ఇక సెలబ్రిటీల గురించి అయితే ఈ లిస్ట్ కొంచెం పెద్దదిగానే ఉంది. అమలాపాల్,సమంత ,నిహారిక వంటి వారు భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరి జీవనాన్ని సాగిస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త సారాంశం ఏమిటంటే..శ్రీజ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతుందంటూ తెగ ప్రచారం జరుగుతుంది. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది.

chiranjeevi daughter sreeja

ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో సంచలనం సృష్టించింది. కూతురు పుట్టిన తరువాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చి..ఇంట్లో పెద్దలు కుదిర్చిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.

chiranjeevi daughter sreeja 3rd marraiage news goes viral

శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తరువాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడంతో.. పాటు..ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో..వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు.

chiranjeevi daughter sreeja 3rd marraiage news goes viral

తాజాగా శ్రీజ పెళ్లికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే శ్రీజ పక్కన ఓ వ్యక్తి ఆమెతో చాలా క్లోజ్‌గా దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో శ్రీజ్ బాయ్ ఫ్రెండ్ ఇతనేనని..త్వరలోనో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ..వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లిపై శ్రీజ కాని, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+