40 ఏళ్లు పూర్తిచేసుకున్న చిరంజీవి బ్లాక్‌బస్టర్... 100 కేజీఎఫ్‌లతో సమానం

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు అప్పట్లోనే ఓ ట్రెండ్ సెట్ చేస్తాయి. కాలం మారుతున్న కొద్దీ వాటి గొప్పతనం మరింత స్పష్టంగా బయటపడుతుంది. అలాంటి అరుదైన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో నిలిచిపోయే క్లాసిక్ 'రాక్షసుడు'. అప్పట్లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తాజాగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కథాంశం, నాటి ట్రెండ్‌ను పరిశీలిస్తే... నేటితరం మోస్ట్ యాక్టెడ్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'కేజీఎఫ్' సినిమాలతో దీనికి ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ చూస్తే థ్రిల్ అయిపోవడం పక్కా..!
ఈ సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ చూస్తే థ్రిల్ అయిపోవడం పక్కా..!

పేరు లేని హీరో... పవర్ ప్యాకింగ్ నరేషన్

దర్శక దిగ్గజం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది. రాధ, సుహాసిని హీరోయిన్లుగా నటించగా, మెగాబ్రదర్ నాగబాబు నటుడిగా అరంగేట్రం చేసింది ఈ సినిమాతోనే! అయితే, ఈ చిత్రంలోని అత్యంత ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే... సినిమాలో కథను నడిపించే లీడ్ రోల్ పోషించిన చిరంజీవి పాత్రకు అసలు పేరే ఉండదు. సినిమాలో ఎవరూ ఆయనను పేరుపెట్టి పిలవరు. కేవలం 'అతడు' అని లేదా 'ఫ్రెండ్' అని మాత్రమే సంబోధిస్తుంటారు. పేరు లేకపోయినా, ఆ పాత్ర చూపించే ప్రభావం, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే విధానం అసాధారణం.

అప్పుడే ఓటీటీలోకి నాని 'ప్యారడైజ్' సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
అప్పుడే ఓటీటీలోకి నాని 'ప్యారడైజ్' సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Chiranjeevi Delivered a Blockbuster 40 Years Ago That Was Equivalent to 100 KGFs

వంద 'కేజీఎఫ్'లతో సమానం

ఇప్పుడు గ్యాంగ్‌స్టర్, మాఫియా నేపథ్యంలో వస్తున్న సినిమాలలో 'కేజీఎఫ్' శైలిని చాలామంది ఉదాహరణగా చూపుతుంటారు. కానీ, ఆ తరహా డార్క్ అండర్ వరల్డ్ బ్యాక్‌‌డ్రాప్‌ను, మదర్ సెంటిమెంట్‌ను అప్పుడే తెలుగు తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. చిన్నతనంలోనే తల్లికి దూరమవడం, చనిపోయే ముందు కొడుకును గొప్పవాడిగా చూడాలన్న తల్లి బలమైన ఆకాంక్ష, ఆ తల్లిని వెతుక్కుంటూ హీరో సాగించే ప్రమాదకర ప్రయాణం.. ఇలా 'కేజీఎఫ్'లో రాకీ భాయ్‌ని నడిపించిన అదే బలమైన మదర్ సెంటిమెంట్ 'రాక్షసుడు' చిత్రానికి కూడా ప్రధాన ఆత్మ.

మాఫియా సామ్రాజ్యంలో బానిసల విముక్తి

సినిమాలో కథాంశం మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది. చిన్నతనంలో ఒక తాగుబోతు హీరోను ఒక మాఫియా ముఠాకు అమ్మేస్తాడు. ఆ గ్యాంగ్ చిన్న పిల్లలను ఒక నిర్జన దీవిలో బానిసలుగా ఉంచుకుని అక్రమ దందాలు నడిపిస్తుంటుంది. అక్కడి నుంచి తప్పించుకున్న హీరో, రావు గోపాల రావుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మళ్లీ అదే మాఫియా శిబిరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ బానిసగా నటిస్తూనే, ఆ సామ్రాజ్యాన్ని లోపలి నుంచి దెబ్బకొట్టి తన తల్లి జాడ కనుగొనడం, అక్కడి అభాగ్యులైన బానిసలకు విముక్తి కల్పించడం సినిమాలోని అత్యుత్తమ హైలైట్స్.

నేటి అత్యాధునిక హంగులతో, పాన్-ఇండియా స్థాయి టెక్నికల్ వాల్యూస్‌‌తో కనుక ఈ కథను ఇప్పుడు తెరకెక్కిస్తే... అది ఒకటే కాదు, ఏకంగా వంద కేజీఎఫ్‌లతో సమానమైన రేంజ్ బ్లాక్‌బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లి కోసం పరితపించే కొడుకు ఆవేదన, యాక్షన్ సీక్వెన్స్‌లు, చిరంజీవి అద్భుతమైన అభినయం కలగలిసిన 'రాక్షసుడు' కేవలం ఒక సినిమా కాదు... తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ ఒక అపురూప దృశ్యకావ్యం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+