రూ.వేల కోట్ల ఆస్తివున్నా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు?

మెగాస్టార్ చిరంజీవి తన స్వయంశక్తిపై ఆధారపడి చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే స్థాయి నుంచి మెగాస్టార్ గా ఆవిర్భవించారు. ఈ క్రమంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అభిమానులకు అందించారు. అలాగే వేలకోట్ల రూపాయల ఆస్తులను కూడా కూడబెట్టారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో సమాజానికి సేవ చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో రూపాయిని ఎంతో జాగ్రత్తగా ఖర్చుపెడుతుంటారు. తన సొంతానికి కూడా ఏనాడూ వేలకు వేలరూపాయలు ఖర్చుపెట్టుకున్న దాఖలాలు లేవు.

ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఏదైనా పార్టీ చేసుకుందామంటే వారికి ఎంత కావాలంటే అంత డబ్బులను ఇచ్చేవారు. యాత్రలకు వెళ్లాలన్నా, పార్టీలు చేసుకోవాలన్నా.. ఇలా చేతికి ఎముక లేదన్నరీతిలో డబ్బులు ఇచ్చేవారు. అయితే మందు పార్టీ చేసుకోవాలని అడిగితే మాత్రం నిర్మాహమాటంగా లేదని చెప్పేవారు. ఎట్టి పరిస్థితుల్లోను వారికి రూపాయి కూడా ఇచ్చేవారు. మందు పార్టీ లు చేసుకోవడం అనేది చెడు అలవాట్లకు దారితీస్తుందని, మనిషిని క్రమశిక్షణ తప్పేలా చేస్తుందని కుటుంబ సభ్యులకు గట్టిగా చెప్పేవారు.

chiranjeevi does not spend single rupee for liquor party

చిరంజీవి వ్యవహరించినట్లుగానే నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా వ్యవహరించేవారు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా చిరంజీవి డబ్బులివ్వకపోవడంతో వీరిద్దరిని అడిగేవారు. కానీ వారు కూడా చిరంజీవి బాటలోనే పయనించేవారు. సరదాగా స్నేహితులతో చేసుకునే హోంపార్టీలకైతేనే డబ్బులిస్తామనేవారుకానీ మందు పార్టీకి మాత్రం నిర్మొహమాటంగా లేవని చెప్పేవారు. మంచిబాటలో మనం కొనసాగడంతోపాటు కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా అదేబాటలో పయనింపచేయాలన్నదే చిరంజీవి ఉద్దేశమని అతని సన్నిహితులు చెబుతుంటారు. అందుకే ఆ పార్టీకి మాత్రం రూపాయి కూడా ఇవ్వరని అంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+