'దేవర' ఎలా ఆడుతుందో నేనూ చూస్తా: మెగా
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం దేవర. ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అరవిందసమేత తర్వాత రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేశారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో కేవలం రెండు సినిమాలు విడుదల చేయడంపై అతని ప్రణాళిక అసంబద్ధంగా ఉందంటూ సినీ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. ఇటువంటి తరుణంలో వస్తున్న దేవరపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన హీరోకు ఆ తర్వాత సినిమా హిట్ అవదు అనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బద్ధలు కొడతాడనే ఆశతో నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో విలేకరి ఎన్టీఆర్ ను ప్రశ్నించారు. కొరటాల శివ గత చిత్రం ఆచార్య ఫెయిల్యూర్ పై మీరేమంటారంటూ ఆ విలేకరి అడిగారు. అందుకు తారక్ ఇచ్చిన సమాధానం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కొరటాల శివకు సరైన వ్యక్తులు, సరైన సమయం ఉంటే అతను అద్భుతమైన సినిమా తీస్తాడని చెప్పాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు యుద్ధం నడుస్తోంది. చిరంజీవి ఆచార్య సినిమాలో వేలు పెట్టాడని, అందుకే అప్పటివరకు నాలుగు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ కూడా ఫ్లాప్ ఇవ్వాల్సి వచ్చిందని తారక్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

సరైన వ్యక్తులు, సరైన సమయం అంటే అతను చిరంజీవిని ఉద్దేశించే మాట్లాడాడంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. దేవర సినిమా ఆడదని, ఫ్లాప్ అవుతుందని, రాజమౌళి సెంటిమెంటు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. తారక్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులకు ఒక ఆయుధం దొరికనట్లైంది. ఈ సినిమాపై నెగిటివిటీని పెంచేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. సాధ్యమైనంతవరకు సినిమాపై వ్యతిరేక ప్రచారం చేసి ఫ్లాప్ అయ్యేలా చేస్తామంటూ చిరు అభిమానులు కామెంట్లు పెడుతుండటంతో వీటిని తారక్ అభిమానులు తిప్పికొడుతున్నారు.












Click it and Unblock the Notifications