కూతురు శ్రీజ విడాకులపై తొలిసారి నోరు విప్పిన చిరంజీవి
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నాగబాబు చిరంజీవితో పాటు వారి సోదరీమణులు, తల్లి అంజనాదేవి కూడా ఈ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ విషయాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు.ఇంటర్వ్యూలో అంజనమ్మ తమ పిల్లలను ఎలా పెంచి పోషించారనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చిరంజీవి తన రెండో కూతురు శ్రీజ వైవాహిక జీవితం గురించి ప్రస్తావించారు.
ఆమె వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చిరంజీవి తొలిసారి మాట్లాడారు. శ్రీజ తన జీవితంలో ఎదురైన తీవ్ర సమస్యలను నానమ్మ అంజనమ్మ వద్దకు వెళ్లి సలహాలు తీసుకున్న సంగతిని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నానమ్మ మాటలు విన్న తర్వాత శ్రీజ దృఢంగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు.నానమ్మ అంజనమ్మ మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చేవని శ్రీజ చెప్పిందని చిరంజీవి వెల్లడించారు.ఎవరో ఒక వ్యక్తి వల్ల నీ జీవితం ఆగిపోవద్దు.. నీవు నిన్ను నీవు నిరూపించుకోవాలి, ముందుకు సాగాలి అని అంజనమ్మ శ్రీజకు ఇచ్చిన మద్దతును చిరంజీవి వివరించారు.

చిరంజీవి రెండో కూతురు శ్రీజ వైవాహిక జీవితం అందరికి తెలిసిందే.19 ఏళ్ల వయస్సులోనే శ్రీజ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది.తన కుటుంబ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పి శ్రీజ సంచలనం సృష్టించింది.
భరద్వాజ్‌తో శ్రీజ కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. కూతురు పుట్టిన తర్వాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చింది. విడాకుల అనంతరం తిరిగి కుటుంబానికి దగ్గరైంది.పెద్దలు కుదిర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తర్వాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడంతో.. పాటు.. ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో..వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు.












Click it and Unblock the Notifications