రజనీకాంత్‌పై సెటైర్లు వేసిన చిరంజీవి..జైలర్ గొప్ప సినిమా కాదంటూ కామెంట్స్ ( వీడియో)
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఓ వెలుగు వెలిగారు. దాదాపు రెండు దశబ్దాలపాటు ఆయన తెలుగు ఇండస్ట్రీని ఏలారు. తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఓడిపాయారు. తిరిగి సినిమాల్లో వచ్చి తనలోని నటనలో ఏమాత్రం పవన్ తగ్గలేదని నిరుపించుకున్నారు. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో, ఉన్న రాజకీయాల్లో ఉన్న, హుందాతనం వ్యవహరించేవారు.
#Rajinikanth attacked by #Chiranjeevi 👍pic.twitter.com/E1pgSigSvA
— VCD (@VCDtweets) October 13, 2023
దాసరి నారాయణరావు తరువాత చిరంజీవే ఇండస్ట్రీ పెద్దగా అందరు భావిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే వెంటనే స్పందించి వారికి తగిన సాయం చేయడంలో చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు. మరి అలాంటి చిరంజీవి తన తోటి నటుడును తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాపై చిరంజీవి సైటైర్లు వేశారు.

తాజాగా ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..తనకు కష్టపడి నటించడం అంటే ఇష్టమని..ఫైట్లు చేయాలి.. డ్యాన్స్‌లు చేయాలి..ఒళ్లు హూనం కావాలి కాని..కష్టపడకుండా నడిచి వస్తుంటే రీరికార్డింగ్‌తో ఎలివేషన్ సీన్లతో వచ్చే డబ్బు తనకు అక్కర్లేదని పరొక్షంగా జైలర్ సినిమాను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.రజనీకాంత్‌పై చిరంజీవి చేసిన కామెంట్స్‌పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వయస్సుకు తగ్గ పాత్రలను చేస్తూ రజనీకాంత్ సూపర్ హిట్ కొట్టారని..ఇప్పటికీ హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఆయన సినిమాలు చేయడం లేదని చిరంజీవికి రజనీ అభిమానులు చురకలు అంటిస్తున్నారు. చిరంజీవి నటించిన భోళా శంకర్, రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలు ఒకరోజు తేడాతో విడుదల అయ్యాయి.భోళా శంకర్ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత డిజాస్టార్‌గా నిలవగా, రజనీకాంత్ జైలర్ సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసి ఆయన కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications