తన లాగే తమ్ముడి జెండాను కూడా పీకిచ్చేద్దామనుకుంటున్నాడా ఏమిటి!

హీరో చిరంజీవి అనవసరంగా స్పందించి తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటున్నారు. సాధారణంగా దేనికీ తొందరపడి స్పందించని చిరంజీవి అసెంబ్లీలో బాలయ్య జగన్ ను అన్నందుకు, చిరు గట్టిగా అడగలేదన్నందుకు విదేశాల్లో ఉన్నప్పటికీ ఎక్స్ లో తన కౌంటర్ ను పోస్ట్ చేశారు. తర్వాత చాలామంది ఆ కౌంటర్ కోసం చిరు ఎక్స్ ఖాతాను జల్లెడ పట్టినా దొరకలేదు. అందులోని చిదంబర రహస్యం ఏమిటో చిరంజీవికి, దాన్ని పోస్ట్ చేయించినవారికే తెలియాలి. అతను స్పందించడంతోపాటు అందులో వ్యంగ్యంగా బాలయ్య మాట్లాడాడు అనడం అనేది బాగా విమర్శలకు తావిస్తోంది.

తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది..
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందన్నట్లుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత చిరంజీవి సమయం అంతగా బాగున్నట్లు కనపడటంలేదు. ఎందుకంటే అన్నీ ఫ్లాపులే పలకరిస్తున్నాయి. మరోవైపు జగన్ చేత అవమానం జరిగితే అది నాలుగు గోడల మధ్యే అనుకుంటే బహిరంగంగా అందరికీ తెలిసేలా వాళ్లు వీడియోలు, ఫొటోలు విడుదల చేశారు. తన కుటుంబాన్ని, అంతకంటే ఎక్కువగా తమ్ముడు పవన్ కల్యాణ్ కుటుంబంపై వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఏనాడూ నోరు విప్పలేదు. పాపం.. పవన్ చిన్న కుమార్తెను అత్యాచారం చేసి హతమారుస్తామని వైసీపీ నాయకులు మాట్లాడారు. ఆరోజు అవన్నీ చిరంజీవికి వినపడలేదా? లేదంటే చెవుడు వచ్చిందా? మూడు రాజధానులకు మద్దతు పలికాడు. పరిపాలన బాగుందన్నాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఆరేసుకుంటున్నారు.

Chiranjeevi is facing severe criticism for responding to Balayya s case

చిరంజీవి టైం బాగున్నట్లు లేదు
పార్టీ పెట్టి అష్టకష్టాలు పడి అధికాకంలోకి వచ్చిన తమ్ముడి చేత కూడా జెండా పీకించేయాలనుకుంటున్నారా ఏమిటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నీకు, నీ తమ్ముడికి చాలా తేడా ఉందంటున్నారు. అంతేకాదు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చిరు, బాలయ్య అభిమానుల మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతోంది. ఏనాడూ దేనికీ స్పందించని చిరంజీవి అలాగే ఉండివుంటే రాజకీయం చప్పబడేది. కానీ అతను సత్వరమే స్పందించి విమర్శలు మూటకట్టుకోవడమేకానీ దాన్ని లాభపడిందికూడా ఏదీ లేదు. ఏమిటో ఈమధ్య చిరంజీవి టైం అస్సలు బాగుండటంలేదని చిరు అభిమానులు కూడా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+