అర్ధరాత్రి డబుల్ ధామాకా.. ఓటీటీలోకి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ తొలిరోజు నుంచే థియేటర్లలో విధ్వంసం సృష్టించింది. బ్లాక్ బస్టర్ టాక్ తో రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5 లో ఫిబ్రవ‌రి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ 7 భాషల్లో రిలీజ్ కానుండటం విశేషం. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ రానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్థ పోస్టు చేసింది.

ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా నటించింది. అలాగే వెంక‌టేశ్ ద‌గ్గుబాటి, క్యాథెరిన్ త‌దిత‌రులు ఇత‌ర పాత్రల్లో అల‌రించారు. బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, ఫ్యామిలీ డ్రామాతో పాటు మంచి యాక్షన్‌ ను క‌ల‌గ‌లిపి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా రూపొందించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Chiranjeevi Mana Shankara Varaprasad Garu on ZEE5 Naveen Polishetty Anaganaga Oka Raju on Netflix

అలాగే మరో సినిమా కూడా ఈ అర్ధరాత్రి ఓటీటీలోకి రానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విక్టరీ కొట్టింది. ఈ క్రేజీ మూవీతో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక సంక్రాంతికి విడుదలైన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+