మెగాస్టార్ విధ్వంసం.. రీజినల్ రికార్డ్స్ బ్రేక్..!

మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైంది. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దూసుకెళ్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ​గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రిలీజైన కేవలం 12 రోజుల్లోనే రూ. 255 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ మూవీ. 70ఏళ్ల వయసులోనూ చిరు ఈ సినిమాలో యాక్టీవ్ గా కనిపించారు. ఆయన నటన చూసేందుకు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కుటుంబాలతో సహా థియేటర్లకు క్యూ కడుతున్నారు.

12 రోజుల్లో 255 కోట్ల గ్రాస్

సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనవరి 12న విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం 12 రోజుల్లో 255 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇది మెగాస్టార్ విధ్వంసం అని నిరూపించింది. అంతేకాక ఈ మూవీ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో రికార్డును బ్రేక్ చేసింది. దాంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే విక్టరీ వెంకటేష్ సినిమా రికార్డును కూడా చిరంజీవి మూవీ బ్రేక్ చేసింది.

చిరంజీవి ఎమోషనల్ లేఖ

ఇక ఇటీవల ఈ మూవీ విజయంపై చిరంజీవి ఎమోషనల్ లేఖ ప్రేక్షకులకు పంపారు. "మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను" అని చిరంజీవి పేర్కొన్నారు.

chiranjeevi-mana-shankara-varaprasad-garu-sankranthi255-cr-in-12-days-mana-shankara-varaprasad

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రిలీజైన కేవలం 12 రోజుల్లోనే దాదాపు రూ. 255 కోట్ల గ్రాస్ సాధించింది. షేర్ వాల్యూ రూ. 160 కోట్ల వరకు ఉంది. ఇది రీజినల్ సినిమాల్లో ఆల్ టైం రికార్డ్ గా ఉంది. అందుకే ఈ చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ వసూళ్లు రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లాంగ్ వీకెండ్ నడుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలోని అల వైకుంఠపురంలో చిత్రం రూ. 250 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. ఈ మూవీ షేర్ వాల్యూ రూ. 155 కోట్ల వరకు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+