ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం..
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్దాలుగా చిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు. ఏడు పదుల వయసులోనూ ఇండస్ట్రీ రికార్డ్స్ ను బద్దలు కొడుతున్నారు. ఇండస్ట్రీలో నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ అన్నట్లుగా దూసుకెళ్తున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వర ప్రసాద్ మూవీతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. మన శంకర్ వర ప్రసాద్ భారీ హిట్ కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు బాబీతో మరో సినిమా చేస్తున్నారు చిరంజీవి. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతున్న క్రమంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
అలాగే చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' చిత్రీకరణ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మేరకు వీఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నాయి. దాంతోపాటు దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మెగా 157 గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.

అయితే ఉగాది పండగ సందర్భంగా చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ద్వారా వేల మందికి సేవలు చేయడమే కాకుండా ఉగాది పర్వదినాన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచి పేద, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో లక్షలాది మందికి విశేష సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. సమాజానికి తన వంతు సాయంగా ఈ సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications