దిల్ రాజుపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ పరిశ్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రసీమల్లోను మంచి గౌరవం ఉంది. రెండోసారి పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబరు 150తోపాటు గతేడాది 2023లో వాల్తేర్ వీరయ్యతో కలిపి రెండు మెగా హిట్లు కొట్టారు. అంతకుమించి ఎటువంటి అభిమానులు కోరుకునే బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయారు. భోళాశంకర్ తో భారీ డిజాస్టర్ ను మూటకట్టుకోవడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఫ్యాన్స్ కోసం సూపర్ హిట్ మూవీ ఇవ్వాలనే ధ్యేయంతో ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

దాసరి నారాయణరావు జీవించి ఉన్న సమయంలో తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా ఉండేవారు. నిర్మాత, దర్శకులు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. అనే భేదభావాలు లేకుండా సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేవారు. ప్రధానంగా చిన్న సినిమాలు నిర్మించేవారికి ఆయన ఎప్పుడూ అండగా నిలిచేవారు. దాసరి మరణించిన తర్వాత సినీ పరిశ్రమ పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. చిరంజీవి పేరు కొద్దిరోజులు నానినప్పటికీ ఆయన నిరాకరించారు. పరిశ్రమకు చెందిన వ్యక్తిగా, సీనియర్ హీరోగా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు, భుజం భుజం కలిసి పోరాడేందుకు తాను కచ్చితంగా ముందుకు వస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ముందుకు రావాల్సిన సమయం వచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

chiranjeevi should give justice to the makers of hanuman movie

ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న సినిమాల్లో హనుమాన్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విషయం తెలిసిందే. గుంటూరు కారం సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న దిల్ రాజు చిన్న నిర్మాతలకు చిన్న న్యాయం.. పెద్ద నిర్మాతలకు పెద్ద న్యాయం చేస్తున్నారనే విమర్శలు బాగా వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే మల్టీప్లెక్స్ లు కాకుండా సింగిల్ స్క్రీన్లు 96 ఉంటే అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. అదేరోజు విడుదలవుతున్న హనుమాన్ కు థియేటర్లు లభించడంలేదు.

దీనిమీద న్యాయం చేయాలని నిర్మాత, దర్శకుడు, హీరో కోరుతున్నారు. అయితే నైజాంలో థియేటర్లను గుప్పిట పట్టిన దిల్ రాజు మాత్రం హనుమాన్ విషయంలో సరైనరీతిలో వ్యవహరించలేకపోతున్నారు. హనుమాన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. చిరంజీవి జోక్యం చేసుకొని దిల్ రాజుతో మాట్లాడి హనుమాన్ కు న్యాయం జరిగేవిధంగా వ్యవహరించాలనే డిమాండ్లు పరిశ్రమ నుంచే కాకుండా తెలుగు సినీ ప్రేమికుల నుంచి కూడా వస్తున్నాయి. చిరంజీవి ఏం చేస్తారో చూడాలి మరి!.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+