చిరంజీవి ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా..?
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.అయితే చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ సుమలతతో ఎక్కువ సినిమాలు చేశారు. చిరంజీవి సుమలతతో క్లోజ్ మూవ్ అవడం చూసి ప్రేమలో ఉన్నారనుకునేవారు.

దీంతో చిరంజీవి సుమలతను పెళ్లి చేసుకోవడం ఖాయమని అంతా భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకోగా, సుమలత కన్నడ నటుడు అంబరీష్‌ను వివాహం చేసుకున్నారు. అనారోగ్యంతో అంబరీష్ కొద్దికాల క్రితమే మరణించారు. భర్త మరణం తర్వాత సుమలత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరుఫున బరిలో దిగుతున్నారు.












Click it and Unblock the Notifications