ప్రతి 10 నిముషాలకు ఒక ట్విస్టు

ప్రతి 10 నిమిషాలకు ఒక ఊహించని మలుపుతో, ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మలయాళీ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ 'చురులి'. లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్-ఫిక్షన్ మిస్టరీ చిత్రం, విడుదలైన కొన్నేళ్లయినా ఇప్పటికీ మైండ్-బెండింగ్ సినిమాలను కోరుకునే ఓటీటీ ప్రియుల్లో హాట్ టాపిక్‌గానే ఉంది.

సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్‌ లో గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ సంచలనం..!
సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్‌ లో గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ సంచలనం..!

కథాంశం

ఒక మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని పట్టుకోవడానికి ఆంటోనీ, షాజీవన్ అనే ఇద్దరు పోలీసులు మారువేషంలో 'చురులి' అనే మారుమూల అటవీ గ్రామానికి వెళ్తారు. అయితే, ఆ గ్రామానికి దాటే చెక్క వంతెన దాటగానే అక్కడి వాతావరణం, ప్రజల ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి. చట్టం, నియమాలు లేని ఆ వింత ప్రపంచంలో ప్రజలు అత్యంత అమానుషంగా, వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ చిక్కుకుపోయిన పోలీసులకు ఊహించని రీతిలో దెయ్యాలు, మిస్టరీ జంతువులు, గ్రహాంతరవాసుల వంటి అతీంద్రియ సంఘటనలు ఎదురవుతాయి. ఆ గ్రామం నుంచి వారు బయటపడ్డారా లేదా అసలు ఆ ఊరి రహస్యం ఏమిటనేది ప్రధాన కథ.

బాలకృష్ణ - నాగార్జున కలిసి నటించిన ఏకైక సినిమా
బాలకృష్ణ - నాగార్జున కలిసి నటించిన ఏకైక సినిమా
Churuli The Unpredictable Thriller With Twists and Surprises Every 10 Minutes

సినిమా ప్రత్యేకతలు

19 రోజుల్లోనే చిత్రీకరణ: ఈ చిత్రాన్ని కేవలం 19 రోజుల వ్యవధిలోనే దట్టమైన నల్లమల తరహా అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించారు. సస్పెన్స్ స్క్రీన్ ప్లే: కథ ఎటు తిరుగుతుందో ఊహించలేని విధంగా ఉండే కథనం, పర్ఫెక్ట్ క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నటీనటులు: వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్, చెంబన్ వినోద్ జోస్, సౌబిన్ షాహిర్, జాఫర్ ఇడుక్కి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ లో అందుబాటులో ఉంది. థ్రిల్లర్, మిస్టరీ కథలనుష్టపడేవారికి ఇది తప్పక చూడాల్సిన సినిమా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+