హీరో, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు ఇప్పుటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా సమాచారం అందుతోంది. రియాల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్ల సైతం ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడటంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.

cine celebrities Phones of were tapped

దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్‌లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లతో పాటు, రియాల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్‌ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.

వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉండటం సంచలనం సృష్టిస్తోంది. వీరితో పాటు ప్రముఖ యాంకర్ల ఫోన్ నెంబర్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్లిన ఓ ప్రముఖ హీరోయిన్ నెంబర్‌ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగా టాలీవుడ్‌లో ఓ ప్రముఖ జంట విడిపోయారనే చర్చ సాగుతొంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరి కొంతమంది సినీ సెలబ్రిటీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+