నయనతారకు బిగ్ షాక్..బ్యాన్ చేసిన ఇండస్ట్రీ..?
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు.

ఇక నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ నుంచి విడాకులు తీసుకుంటుందని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో భర్త విఘ్నేష్ శివన్‌ను నయనతార అన్‌ఫాలో చేయడంతో ఆమె విడాకులు బాట పడుతుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రచారానికి తెర దించుతూ భర్తతో కలిసి ఉన్న ఫొటోలను నయనతార తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా నయనతారకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నయనతార తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయింది. దాంతో తెలుగు ఇండస్ట్రీ నయనతారను బ్యాన్ చేసిందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో ఓసారి తెలుగు హీరోలపై నయనతార అనుచిత వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీకి నయనతార దూరంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతుంది. ఎంత క్రేజ్ ఉన్న ప్రవర్తన సరిగాలేక ఆమెను తెలుగు ఇండస్ట్రీ దూరం పెట్టిందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
-
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’











Click it and Unblock the Notifications