రామ్‌చరణ్ 'గేమ్‌ఛేంజర్‌'పై అల్లు అర్జున్ నెగెటివ్ ప్రచారం?

మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు బాగా దూరం పెరిగింది. ఇది ఎంతగా అంటే భవిష్యత్తులో వీళ్లు కలవడం దాదాపు అసాధ్యమే అని అనిపించేలా. ఏపీ ఎన్నికల సమయం వరకు గుట్టుగా సాగుతున్న విభేదాలు ఆ సమయంలో భగ్గుమన్నాయి. పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్ కూడా పిఠాపురంలో ప్రచారం చేయగా, బన్నీ మాత్రం తన స్నేహితుడు రవికిషోర్ రెడ్డి వైసీపీ తరఫున నంద్యాల నుంచి పోటీచేస్తుండటంతో స్వయంగా అక్కడకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.

తీవ్రరూపం దాల్చిన విభేదాలు
అప్పటి నుంచి విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. పవన్ గెలుపొందిన తర్వాత కేవలం ట్వీట్ తో అల్లు అర్జున్ సరిపెట్టాడు. మెగా అభిమానులు అల్లు అర్జున్ ను ప్రతిరోజు సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విభేదాలు మొదలవడానికి ముందే రామ్ చరణ్‌తో అల్లు అర్జున్ కు పడటంలేదని వార్తలు వచ్చాయికానీ వాటిపై స్పష్టత రాలేదు. క్రమేణా రోజులు గడిచేకొద్దీ అవి నిజమే అని అర్థం కావడంతోపాటు అసలు వీరిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయనే విషయంపై అభిమానులు దృష్టిసారించారుకానీ పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయారు.

clashes between allu arjun fans and ramcharan fans in social media

గేమ్ ఛేంజర్ పై నెగెటివ్ వ్యాఖ్యలు?
షూటింగ్ పూర్తిచేసుకొని త్వరలోనే విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ పై అల్లు అర్జున్ నెగెటివ్ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఏ సందర్భంలో అతను మాట్లాడాడు? ఎవరి దగ్గర వ్యాఖ్యానించాడు? అసలు నిజంగా మాట్లాడాడా? లేదంటే పుకార్లా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావడంలేదు. అల్లు అర్జున్ దగ్గర అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియా సైన్యం ఉంది. దీనిద్వారా ఇతర హీరోల సినిమాలపై, వారి వ్యక్తిగత విషయాలపై నెగెటివిటీని వ్యాప్తిచేయడంలో ముందుండేవాడంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ విషయంలో కూడా బన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నారని మెగా అభిమానులు మండిపడుతున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని, పుష్ప2పై అదేస్థాయిలో ప్రచారం చేస్తామంటూ మెగా అభిమానులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+