స్టార్ హీరోతో గొడవ పడిన త్రివిక్రమ్ శ్రీనివాస్?
మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా తన ప్రతిభ నిరూపించుకుంటూ టాప్ డైరెక్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేసేవారు. విజయ్ భాస్కర్ చిత్రాలకు కథా రచయితగా , మాటల రచయితగా పనిచేసిన తర్వాత నువ్వేనువ్వే సినిమా నుంచి దర్శకత్వ రంగంలోకి అడుగు పెట్టారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. ఒక రైటర్ కోటిరూపాయల పారితోషికం తీసుకోవచ్చని నిరూపించిన రైటర్ కూడా ఆయనే. పోసాని దగ్గర పనిచేస్తున్న సమయంలో ఒక సినిమాకు సంబంధించి చిన్న పాత్రలో నటిస్తున్న అపరిచితుడు విక్రమ్ కు డైలాగ్ ను వివరించారు. విషయం అర్థంకాకపోయేసరికి విక్రమ్ త్రివిక్రమ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే త్రివిక్రమ్ కూడా తగ్గకుండా అంతేస్థాయిలో విక్రమ్ పై అరిచారు.

ఇద్దరూ కొత్తవారే కావడంతో ఆ సినిమా డైరెక్టర్ హీరో విక్రమ్ ను, త్రివిక్రమ్ ను పిలిచి గొడవ పడకుండా పనిచేసుకోవాలని చెప్పి పంపించారు. ఆ తర్వాల కాలక్రమంలో విక్రమ్ తమిళ పరిశ్రమకు వెళ్లి స్టార్ హీరోగా మారారు. త్రివిక్రమ్ రైటర్ నుంచి డైరెక్షన్ లోకి అడుగుపెట్టి విజయవంతమయ్యారు. స్టార్ డైరెక్టరయ్యారని చెప్పొచ్చు. ఒకరు స్టార్ హీరోగా, మరొకరు స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి వీరి కాంబినేషన్ లో సినిమా తీద్దామని కొందరు ప్రయత్నించారు. అయితే ఆరోజు పడిన గొడవవల్ల త్రివిక్రమ్ విక్రమ్ తో సినిమా చేసేందుకు సిద్ధపడలేదు. ప్రస్తుతం తెలుగు ఫిలింనగర్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ ఎవరితో గొడవ పడకుండా ఎవరిపని వారు చేసుకుంటూ వెళితే కెరీర్ లో విజయం సాధిస్తారనేదానికి త్రివిక్రమ్, విక్రమ్ ఉదాహరణ అని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఒకటి, రెండు సినిమాలు మినహా దాదాపుగా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా లేదంటే సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రం చేస్తున్న త్రివిక్రమ్ దాని తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు.
అయితే అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ లో ఉండటంతోపాటు అది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. చాలా ఎక్కువ సమయం ఉండటంతో తాను రాసుకున్న కథతో ఒక మల్టీస్టారర్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆ కథను ఇద్దరు హీరోలకు వినిపించడమే కాకుండా వారిచేత ఓకే అనిపించుకున్నారు. అయితే ఈ విషయాన్ని సినిమా ప్రారంభించేంత వరకు బయటకు తెలియనివ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో త్రివిక్రమ్ ఉన్నారు.
వాస్తవానికి వెంకటేష్ సోలో హీరోగా సినిమా తీద్దామని త్రివిక్రమ్ భావించారు. అయితే కథ ప్రకారం ఇది మల్టీస్టారర్ అయితే బాగుంటుందని భావించి మరో హీరోగా నానిని ఎంపిక చేసుకున్నారు. వారిద్దరిని ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఏ బ్యానర్ పై దీన్ని నిర్మించబోతున్నారు అనే స్పష్టత రాలేదు. అయితే ఈ సినిమా కామెడీ జోనరల్ లో ఉంటుందని, కథకు వెంకటేష్, నాని న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నారు. రహస్యంగా వీరిద్దరికీ కథ వినిపించి ఓకే అనిపించుకున్నారని, త్వరలోనే ఇది పెట్టాలెక్కబోతోందని తెలుగు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications