ఫిల్మ్ ఇండస్ట్రీకి విజయ్ గుడ్ న్యూస్- ఇకపై
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. కోలీవుడ్ పై వరాల జల్లు కురిపించారు. తమిళ చిత్ర పరిశ్రమ నుండి అందిన విజ్ఞప్తులపై ఆయన సానుకూలంగా స్పందించారు. మాస్ హీరోగా మొన్నటివరకు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తమిళనాడులో ఇకపై నూతనంగా విడుదలయ్యే సినిమాలన్నీ కూడా తొలి వారం రోజుల పాటు రోజుకు అయిదు ఆటలను ప్రదర్శించుకోవచ్చు. దీనికోసం సినిమా విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎటువంటి అనుమతులను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది.. తమిళ సినిమాలకు మాత్రమే పరిమితం. విడుదలైన తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లల్లో రోజుకు అయిదు ఆటలను ప్రదర్శించడానికి ఆయన అంగీకరించారు.

ఈ మేరకు జీవో కూడా విడుదల అయింది. ఈ అనుమతి కోసం థియేటర్ల యజమానులు, సినీ పరిశ్రమకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు విజయ్ ను కలిశారు. వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రంలో సినిమా ప్రదర్శన నియమాలను సవరించాలని కోరారు. వారి విజ్ఞప్తుల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి. ఈ జీవో వచ్చాక విడుదల అయ్యే మొదటి తమిళ సినిమా నుంచి ఈ వర్తింపు అమలవుతుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం తన ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. మే 16న సినీ పరిశ్రమ ప్రతినిధులు విజయ్‌ని కలిసి పలు విజ్ఞప్తులు సమర్పించారని, రోజుకు అయిదు ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలన్నది వారి ప్రధాన కోరుకున్నారని సీఎంఓ తెలిపింది. దీనిపై సంబంధిత ప్రతినిధులతో చర్చించిన అనంతరం విజయ్ ఆదేశాల మేరకు జీవో విడుదల చేసినట్లు వివరించింది.
தமிழ்நாட்டிலுள்ள அனைத்து திரையரங்குகளில், புதிய தமிழ்த் திரைப்படங்கள் வெளியிடப்படும் நாளிலிருந்து ஏழு நாட்களுக்கு தினசரி ஜந்து காட்சிகள் திரையிடஅனுமதியளித்து⁰மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர்
— CMOTamilNadu (@CMOTamilnadu) May 25, 2026
திரு ச.ஜோசப் விஜய் அவர்கள் உத்தரவு#CMJosephVijay pic.twitter.com/RpUK6AL8kC
ప్రస్తుతం అమలులో ఉన్న 'తమిళనాడు సినిమా (నియంత్రణ) నిబంధనలు, 1957'లోని సీ ఫామ్ లైసెన్స్ షరతుల్లో గల 14-ఏ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు రోజుకు గరిష్టంగా నాలుగు ప్రదర్శనలు మాత్రమే ఇవ్వడానికి అనుమతి ఉంటుంది. పండుగ రోజులు లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం ఒక అదనపు ప్రదర్శనకు అవకాశం ఉండేది. దీన్ని తాజాగా సవరించింది తమిళనాడు ప్రభుత్వం.
పండుగ రోజులు, ప్రభుత్వ సెలవులు, శనివారాలు, ఆదివారాల్లో కూడా అయిదు షోలు వేయడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం థియేటర్లు ఇకపై ప్రభుత్వం లేదా లైసెన్సింగ్ అధికారి నుండి ప్రత్యేక అనుమతులు పొందవలసిన అవసరం లేదని విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications