విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సినీ నటి రష్మిక పెళ్లి ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ నివాసానికి వచ్చారు. సీఎం రాకతో విజయ్ ఇంట్లో సందడి నెలకొంది. విజయ్- రష్మిక జంటకు పూలబొకేను అందజేసిన సీఎం రేవంత్.. ఆ తర్వాత విజయ్ ఫ్యామిలీతో సరదాగా ముచ్చటించారు.
Heartfully touched that the Hon’ble Chief Minister of Telangana, Shri. @revanth_anumula garu, took the time to visit our home this evening and bless us on our wedding. Grateful for the love and affection he always shares 🙏 pic.twitter.com/QAbp9127ad
— Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2026
ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. "తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి ఆశీర్వదించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని విజయ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్- రష్మిక ల రిసెప్షన్ బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే నిన్న దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ఇవాళ విజయ్ దేవరకొండ ఇంటికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఇటీవల నటి రష్మిక మందన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రిసెప్షన్ కు ఆహ్వానించారు రష్మిక. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరి బంధం బలపడినట్లు తెలుస్తోంది.
-
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
రూ.100 కోట్లు ఎక్కువసార్లు సాధించిన ఏకైక హీరో -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
"ఉస్తాద్" ఊచకోతకు సిద్ధమా.. మార్చి 19 రిలీజ్ ఫిక్స్ ! -
మనసున్న మారాజు.. మా ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్"... -
క్లిక్స్ కోసం ఇంత నీచమా?: సోదరుడి కోసం రంగంలోకి స్టార్ హీరోయిన్! -
అమిత్ షా ముందకు కీలక ప్రతిపాదన? -
16 ఏళ్ల తర్వాత బెస్ట్ ఫ్రెండుతో కలిసి పవన్ కళ్యాణ్ మూవీ..! -
మెగా కాంపౌండ్ లో తళుక్కుమన్న మలయాళ స్టార్- ఊహాగానాలకు ఆజ్యం? -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
వాళ్లు అందరూ సర్వనాశనం అయిపోతారు - చలాకీ చంటి -
ఆ పథకంలో రూ. 4లక్షలు రాయితీ.. రైతులకు భారీ శుభవార్త!












Click it and Unblock the Notifications