Honeytrap Case : మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు.. హీరోయిన్ సంచలన ఫిర్యాదు

Athulya Chandra : కేరళలోని కొచ్చిన్‌లో మలయాళ సినీ వర్గాలను, వైద్య రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసిన హైడ్రామా కేస్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. అత్యవసర వైద్యం పేరుతో ఫ్లాట్‌కు పిలిపించి, తనపై దాడి చేసి లక్షల విలువైన వస్తువులు దోచుకున్నారంటూ ఓ 41 ఏళ్ల వైద్యుడు పోలీసులను ఆశ్రయించగా.. ఆ కేసులో అరెస్ట్ అయిన మలయాళ నటి రివర్స్ కౌంటర్ ఇచ్చింది. సదరు డాక్టరే తనపై మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అతనిపైనే తీవ్రమైన లైంగిక వేధింపులు, రేప్ కేసు నమోదు చేయించింది.

పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!
పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!

ఈ నెల 2వ తేదీన అత్యవసరంగా వైద్య చికిత్స అందించాలని కొచ్చిన్ నగరంలోని ఒక ఫ్లాట్ నుంచి 41 ఏళ్ల వైద్యుడికి ఫోన్ వచ్చింది. బాధ్యతగల డాక్టర్‌గా ఆయన వెంటనే ఆ ఫ్లాట్‌కు చేరుకున్నారు. తీరా లోపలికి వెళ్లాక అక్కడ ఉన్న కొందరు ఆయనపై ఒక్కసారిగా దాడికి దిగారు. భౌతిక దాడికి పాల్పడడమే కాకుండా.. ఆయన వద్ద ఉన్న ఐఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు సహా దాదాపు రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను బలవంతంగా లాక్కున్నారు.

Cochin Doctor Honeytrap Case Shocking Twist Actress Athulya Chandra Alleges Rape by Doctor

బాధిత వైద్యుడు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ దోపిడీ కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన కొచ్చిన్ పోలీసులు.. 'మత్తు వదలరా' ఫేమ్ నటి అతుల్య చంద్ర, నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లితో పాటు మరొకరిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ దోపిడీ అరెస్టులతో కేసు ముగిసిందనుకునే లోపే అసలు ఊహించని సంచలన పరిణామం ఎదురైంది. నటి అతుల్య చంద్ర బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వైద్యుడిపైనే అత్యాచారం , లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

నటి తరఫున పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. వైద్య చికిత్స పేరుతో తరచుగా తమ ఫ్లాట్‌కు వస్తున్న సదరు డాక్టర్ ప్రవర్తన మొదటి నుంచీ అనుమానాస్పదంగా ఉండేది. ఒక సందర్భంలో ఆయన తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని నటి ఆరోపించింది. ఆయన చేస్తున్న ఈ ఆకృత్యాలకు, అక్రమ ప్రవర్తనకు తగిన బుద్ధి చెప్పాలనే పక్కా ప్లాన్‌తోనే ఈ నెల 2వ తేదీన అత్యవసర వైద్యం కావాలంటూ ఫ్లాట్‌కు రప్పించినట్లు ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేసింది.

Scene Movie Review: సరికొత్త అవతారంలో సూర్య.. 'సీన్’ మూవీ రివ్యూ!
Scene Movie Review: సరికొత్త అవతారంలో సూర్య.. 'సీన్’ మూవీ రివ్యూ!

వైద్యుడిపై దాడి, దోపిడీ ఘటనలో కేవలం ఈ ముగ్గురే కాకుండా మరో తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ తొమ్మిది మంది నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఒకే ఘటనపై ఇరువర్గాలు పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడం, ఒకవైపు దోపిడీ కేసు.. మరోవైపు అత్యాచారం కేసు నమోదు కావడం కొచ్చిన్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఇది ముందస్తు పథకం ప్రకారం డాక్టర్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి వేసిన హనీట్రాప్ డ్రామానా..? లేక నిజంగానే వైద్యుడి అక్రమ ప్రవర్తనకు నిరసనగా నటి వర్గం చేసిన దాడినా?. ఈ ప్రశ్నలకు సమాధానం తేల్చేందుకు కొచ్చిన్ పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుడి సైంటిఫిక్ ఆధారాలు, ఫ్లాట్ సిసిటివి విజువల్స్, నటి కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+