పుష్ప-2 సినిమాకు హిందీలో వచ్చిన కలెక్షన్లు కూడా మనకు రాలేదు కదా అన్నా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే, సినిమా విడుదలైన తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన, ముఖ్యంగా నెగిటివ్ టాక్ ఎదుర్కొంటోంది. ఈ ప్రతికూలత సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి "హరిహర వీరమల్లు" సుమారు రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని అంచనా. నెట్ కలెక్షన్లు రూ.44.20 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కలెక్షన్లు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచినా, రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇది ఆశించిన స్థాయి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

collections of the Hindi film Pushpa-2 did not reach the Harihara Veeramallu film either

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 హిందీ వెర్షన్ తొలిరోజు రూ.72 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. దీనితో పోలిస్తే "హరిహర వీరమల్లు" కలెక్షన్లు వెనుకబడి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.103 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. ప్రస్తుత నెగిటివ్ టాక్‌తో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా మారిందని చెప్పవచ్చు.

సినిమా కథ, దర్శకత్వంపై వస్తున్న విమర్శలు, ముఖ్యంగా ద్వితీయార్థం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు వసూళ్లపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందు, పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పుష్ప-2 రికార్డులను బ్రేక్ చేస్తామని సవాల్ విసిరారు. అయితే ప్రీమియర్స్‌లో కూడా అల్లు అర్జున్ పుష్ప-2ను క్రాస్ చేయలేకపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+