ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కలర్స్ స్వాతి..
కలర్స్ స్వాతి పేరు తెలియని వారుండరు. ఒక ప్రోగ్రామ్‌తో ఏకంగా తన పేరునే మార్చుకుంది ఈ నటి. తాజాగా కలర్స్ స్వాతి ఇండ్రస్టీ గురించి మాట్లాడిన మాటలు ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది నటి కలర్స్ స్వాతి. ఇండస్ట్రీలో తనకు ఎదురయిన చేదు అనుభవనాలను ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా : స్వాతి కలర్స్ అనే ఓ టీవి ప్రో్గ్రామ్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నటిగా మారి, ఎన్నో ఆఫర్లను కొట్టేసింది. యాంకర్‌గా, సింగర్‌గా ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్‌గా మారారు. డేంజర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు కలర్స్ స్వాతి. అష్టాచమ్మ వంటి సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో హీరోయిన్ చెల్లెల్లి రోల్‌లో చేసి అందరిని మెప్పించింది.

తమిళలంలో కూడా పలు సినిమాలు తీశారు : స్వాతి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి మంచి ఆఫర్లను దక్కించుకుంది. తెలుగు వారికి తమిళంలో మంచి ఆదరణే లభించింది. కలర్స్ స్వాతి తమిళంలో సుబ్రమణ్యపురం అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక, తెలుగులోనూ స్వామిరారా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా నటించి అందరని మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో సినిమాలు తగ్గడంతో స్వాతి పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిల్ అయ్యింది
ఓ ఇంటర్య్వూలో ఇండస్టీపై సంచల వాఖ్యలు : పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టింది కలర్స్ స్వాతి. చాలా రోజులకి మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది స్వాతి. అయితే, ఈ సందర్భంగా స్వాతి చాలా ఇంటర్య్వూలలో పాల్గొన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కొత్తలో తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చారు. డేంజర్ సినిమా చేస్తున్న సమయంలో అల్లరి నరేష్ గారు నా దగ్గరకు వచ్చి కంగారుగా నీకు సంబంధించి ఎదో యం.యం.ఎస్ వచ్చింది చూసావా అని అడుగుతూ నాకు ఒక వీడియో చూపించాడు.
ఆ వీడియో చూసిన తర్వాత నాకు మనుషుల మీద ఎంతో విరక్తి కలిగింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని నాలో నేనే భాద పడ్డాను. అంతే కాదు అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దామనే నిర్ణయం కూడా తీసుకున్నా. ఇక పై సినిమాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాను. కానీ నా స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో మళ్లీ ముందడుగు వేశాను. పెద్ద పెద్ద సెలబ్రిటీకే ఇలాంటి తప్పలేదంటూ నా స్నేహితులు నాకు ఎంతగానో ధైర్యం చెప్పారు. వాళ్లు ఇచ్చిన సలహాలు సూచలన మేరకే మళ్లీ సినిమాలు కొనసాగించలగలిగాను అంటూ చెప్పుకోచ్చింది కలర్స్ స్వాతి.












Click it and Unblock the Notifications