Pushpa-2: రికార్డుల కోసం టికెట్ ధరలు పెంచుతారా..!

సాధారణంగా మనం సినిమాకు ఎందుకు వెళ్తాం. కాస్త సేద తీరడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. కానీ ఇప్పుడు సినిమాకు వెళ్లాలంటనే భయమేస్తోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు చూడాలంటే.. జేబుకు చిల్లే.. తాజాగా పుష్ప-2 కు టికెట్ల ధరల పెంపునకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీంతో టికెట్లు రేట్లు భారీగా పెంచుకునే అవకాశం వచ్చింది. డిసెంబర్ 4 రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షో టికెట్ ధరపై రూ. 800 పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. ఇక డిసెంబర్ 5న సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.200 వరకు పెంచే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై పెంపు ఉండనుంది.

డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు 5 షోలకు అనుమతి వచ్చింది. ఈ సినిమా చూడాలంటే కొంత మంది రెండు, మూడు రోజుల జీతం కూడా సరిపోదేమో. పుష్ప-2ను ప్రపంచ వ్యాప్తంగా 12500 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని 6 భాషల్లో ఏడు ఫార్మాట్లలో ఈ మూవీ ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమ రికార్డు సృష్టించబోతున్నట్లు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద వసూల్లు సునామీ సృష్టిస్తుందని అంటున్నారు.

Common people are expressing concern over the price hike of the movie Pushpa-2

సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం.. టికెట్ల రేట్లు పెంచుకుంటే వసూల్లు సునామే వస్తుందని.. సెటైర్ వేస్తున్నారు. అయితే పుష్ప ఒక్క సినిమాకే టికెట్లు రేట్లు పెంచారా అంటే.. లేదు గతంలో చాలా మూవీస్ కు టికెట్ల ధరలు పెంచారు. అయితే వసూల్లు రికార్డు కోసం టికెట్ల ధరలు పెంచడం కాదు.. సినిమాను అందరూ చూసేలా తీయాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పెరిగిన టికెట్ల ధరలతో సినిమాలు చేసేది వారి ఫ్యాన్సే కానీ.. సామాన్యులు సినిమా చూడలేరని చెబుతున్నారు.

పుష్ప-2 సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచడంపై పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. టికెట్ ధరలు పెంచితే సినిమా చూడొద్దు.. అప్పుడు వారే తగ్గిస్తారు. కానీ.. టికెట్ల ధరలు పెంచినా మూవీ సూస్తామంటే ఎవరు ఏం చేయలేరని.. పలువురు చెబుతున్నారు. ఏదిఏమైనా రికార్డుల కోసం టికెట్ల ధరలు పెంచడం వల్ల సామాన్యులు వినోదానికి దూరమయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+