అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్..సినిమా రిలీజ్ టైంలోనే టార్గెట్ చేశారే..!
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా వచ్చే గురువారం(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినీ యావత్తు మొత్తం కూడా పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తున్నారు. ప్యాన్ ఇండియా లేవల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప-2కు పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్‌పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఆర్మీ అని పిలుస్తుంటారు.
ఆర్మీ అంటూ తన ఫ్యాన్స్‌ను చాలా సందర్భాల్లో ఆయన పిలవడం జరిగింది. పుష్ప-2 ప్రమోషన్స్ లో కూడా అలాగే అంటున్నారు. వారంతా తన కోసం పోరాడతారని, అందుకే ఆర్మీని అంటానని తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ చెప్పడం జరిగింది.అయితే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కొనడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్మీ పదం వాడుతున్నందుకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలంటూ గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అర్జున్ అర్జున్ అభిమానులను ఆర్మీ అని పిలవడంపై శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని తెలిపారు. ఆర్మీ జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. కానీ అల్లు అర్జున్ అవేం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అల్లు అర్జున్ ఎప్పటి నుంచో తన అభిమానులను ఆర్మీ అని పిలుస్తున్నారని, ఇప్పుడు కొత్తగా ఏం పిలవడం లేదని ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు. సరిగ్గా సినిమా విడుదల సమయంలో తమ హీరోపై ఫిర్యాదు చేయడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.మరి దీనిపై అల్లు అర్జున్ టీమ్ స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications