కంగనా రనౌత్ ఓ వేశ్య.. రేటు ఎంతో చెబుతారా..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కంగనా బీజేపీ తరుఫున ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన అభ్యర్థుల లిస్ట్‌లో బీజేపీ కంగనా రనౌత్‌కు చోటు కల్పించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కంగనా రనౌత్ ఎంపీగా పోటీ చేయనున్నారు.
మండి నియోజకవర్గం కంగనా రనౌత్ జన్మస్థలం కావడంతో ఆమెకు అక్కడ సీటు కేటాయించినట్టుగా తెలుస్తోంది. తనకు అవకాశం కల్పించడంపై కంగనా స్పందిస్తూ.. కార్యకర్తగా పని చేసి పార్టీ గెలుపుకు తనవంతు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది.ఇక కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై అప్పుడే విమర్శలు మొదలైయ్యాయి. కాంగ్రెస్ నాయకులు కంగనా రనౌత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే కంగనాను వేశ్యతో పోల్చడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సుప్రియా శ్రీనాటే కంగనాను ఉద్దేశించి ఆమె ఓ వేశ్య అంటూ అభ్యంతరకర పోస్ట్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కంగనాకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే సుప్రియా శ్రీనాటే తన ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఫోటోని షేర్ చేస్తూ.. మండిలో రేట్లు ఎవరైనా చెబుతారా? అంటూ కంగనాను వేశ్యగా అభివర్ణించింది. అయితే ఈ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె వెంటనే దీన్ని తొలగించారు.

కాంగ్రెస్ నాయకురాలు తనపై చేసిన అసభ్యకరమైన కామెంట్స్‌పై రియాక్ట్ అయిన కంగనా తనదైనశైలిలో కాంగ్రెస్ నాయకురాలకు కౌంటరిచ్చింది. తన రాజకీయ ప్రత్యర్థిని గౌరవిస్తూనే కంగనా పంచ్‌లు విసిరారు. నా గత 20 ఏళ్ల కెరీర్‌లో నేను అన్ని రకాల మహిళల పాత్రలను పోషించాను. క్వీన్‌లోని అమాయక అమ్మాయి నుండి ధాకడ్‌లోని సమ్మోహన గూఢచారి వరకు, మణికర్ణికలోని వీరనారి నుండి చంద్రముఖిలోని రాక్షసి వరకు, రజ్జోలోని వేశ్య నుండి తలైవిలో విప్లవ నాయకురాలి వరకు ప్రతి పాత్రలో నటించాను.ప్రతి స్త్రీ తన గౌరవానికి అర్హురాలే అంటూ కంగనా ట్వీట్ చేసింది. ప్రస్తుతం కంగనా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications