Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'కూలీ' రెమ్యునరేషన్ రచ్చ: సూపర్ స్టార్‌కి భారీగా, మిగతా వారికి 'చిల్లర'!

Coolie Cast Fee: ఈ వారంలో ఫిల్మీ ఫ్రైడే రాబోతోంది. ఆగస్టు 15 కారణంగా ఈ వారం సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారాంతంలో రెండు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఆగస్టు 14న విడుదల కానున్న రెండు భారీ చిత్రాలలో ఒకటి బాలీవుడ్ నుంచి 'వార్ 2' కాగా.. మరొకటి సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా 'కూలీ' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూ.375 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన 'కూలీ' చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నటించిన ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

రజనీకాంత్, అమీర్ ఖాన్ రెమ్యునరేషన్
రజనీకాంత్: ఈ చిత్రంలో 'దేవా' అనే పాత్రలో నటిస్తున్న రజనీకాంత్ భారీగా రెమ్యునరేషన్ అందుకున్నారు. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. ఆయన మొదట రూ. 150 కోట్లుగా ఒప్పందం చేసుకున్నప్పటికీ, సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ల విజయాన్ని బట్టి అది రూ. 200 కోట్లకు పెరిగింది. ఈ భారీ మొత్తం ఆయన స్టార్‌డమ్‌ను తెలియజేస్తుంది.

Coolie Remuneration Drama Superstar Bags Rs 150 Cr Others Get Mere Change

అమీర్ ఖాన్: ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన అమీర్ ఖాన్.. కేవలం 15 నిమిషాల అతిథి పాత్రకే రూ. 20 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆయన 'దాహా' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. ఇది ఆయనకున్న మార్కెట్ విలువను స్పష్టం చేస్తుంది.

ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్
నాగార్జున: మొదటిసారిగా విలన్ పాత్రలో నటిస్తున్న నాగార్జున, 'సైమన్' పాత్రకు గాను రూ. 10 కోట్లు అందుకున్నారు.

సత్యరాజ్, ఉపేంద్ర: 'బాహుబలి' ఫేమ్ సత్యరాజ్ (రాజశేఖర్ పాత్ర), కన్నడ నటుడు ఉపేంద్ర (కలిషా పాత్ర)లకు చెరో రూ. 5 కోట్లు లభించాయి.

శ్రుతి హాసన్: ఈ సినిమాలో 'ప్రీతి' పాత్రలో నటిస్తున్న శ్రుతి హాసన్‌కు నటుల జాబితాలో అత్యల్పంగా రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ లభించింది.

దర్శకుడు, సంగీత దర్శకుడు: దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ. 50 కోట్లు రెమ్యునరేషన్ లభించగా, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు రూ. 15 కోట్లు లభించాయి.

అడ్వాన్స్ బుకింగ్‌లో 'కూలీ' జోరు
ఓ ట్రేడ్ వెబ్‌సైట్ ప్రకారం..'కూలీ' సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో రూ. 14 కోట్లు వసూలు చేయగా.. 'వార్ 2' రూ. 2.08 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 'కూలీ' చిత్రం దాదాపు 6 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రస్తుతం కూలీ దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 68.5 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. ఇక ఓవరాల్ గా 'కూలీ' ఫస్ట్ డే ప్రీ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు 'కూలీ' చిత్రం పట్ల ప్రేక్షకులలో ఉన్న అంచనాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+