కూలీ vs వార్ 2: ఏ సినిమా హిట్ అంటే..?

భారీ అంచనాల మధ్య విడుదలైన వార్ 2 , కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక రసవత్తరమైన పోరుకు తెరతీశాయి. తొలి రోజు కలెక్షన్స్‌లో కూలీ సినిమా మాస్ బజ్‌తో దూసుకుపోగా, అంచనాలను అందుకోలేకపోయిన వార్ 2 వెనుకబడింది. అయితే, ప్రేక్షకుల నుండి రెండు సినిమాలకూ మిశ్రమ స్పందన రావడంతో, రెండో రోజు ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది.

అయితే, రెండో రోజు బుకింగ్స్ ట్రెండ్‌లో ఊహించని విధంగా వార్ 2 సినిమా లీడ్ తీసుకుంది. కూలీ సినిమా గంటకు 40 వేలకు పైగా టికెట్ సేల్స్‌తో దూసుకుపోతుండగా, వార్ 2 ఏకంగా గంటకు 50-60 వేల టికెట్ సేల్స్ సాధించి ఆశ్చర్యపరిచింది.

Coolie vs War 2 First Day Box Office Rajinikanth s Film Dominates Over Hrithik Roshan amp amp Jr NTR Starrer

ఈ అనూహ్యమైన లీడ్‌లో హిందీ మార్కెట్ నుండి వచ్చిన గ్రోత్ ప్రధాన కారణంగా నిలిచింది. సౌత్ మార్కెట్‌లో కూలీ ఆధిపత్యం కొనసాగించినప్పటికీ, ఓవరాల్ బుకింగ్స్‌లో వార్ 2 అగ్రస్థానంలో నిలిచింది. అయితే మొదటి రోజు కలెక్షన్లలో మాత్రం రజనీకాంత్ కూలీ సినిమా సత్తా చాటింది.

రజనీకాంత్ నటించిన కూలీ సినిమా మొదటి రోజున ఇప్పుడు 145 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపోతే 150 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం మించే ఛాన్స్ కూడా ఉంది. మొత్తం మీద ఆల్ టైం ఎపిక్ రికార్డుల రాంపెజ్ ను సినిమా చూపించిన సినిమా అఫీషియల్ కలెక్షన్స్ పరంగా ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతుందో చూడాలి.

ఇక అందరూ అనుకున్నట్టుగా వార్2 మూవీ మినిమమ్ 65 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ తో ఓపెనింగ్స్ ను అందుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ అవి తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు మొదటి రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 28-30 కోట్ల రేంజ్‌కి అటూ ఇటూగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

ఈ పోరులో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలంటే, రెండో రోజు కలెక్షన్ల కోసం ఎదురుచూడాల్సిందే. ఈ రెండు చిత్రాలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బాక్సాఫీస్‌ వద్ద కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+