అందంతో పిచ్చెక్కిస్తున్న దక్ష నగార్కర్
సినిమా పరిశ్రమ అనేది విచిత్రమైనది. స్టార్స్ గా గుర్తింపు పొందాలనే లక్ష్యంతో పరిశ్రమలో అడుగు పెడుతుంటే కొందరికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. మరికొందరు మాత్రం పెద్దగా శ్రమించే పనిలేకుండానే గుర్తింపు పొందుతుంటారు. ఈ రెండు అంశాలకు భిన్నంగా దక్ష నగార్కర్ మాత్రం పేరు సంపాదించుకుంది.ఏకే రావు పీకే రావు , హోరాహోరీ, హుషారు, జాంబిరెడ్డి లాంటి సినిమాల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా వచ్చిన బంగార్రాజు సినిమాలో కీలక పాత్ర పోషించింది. బంగార్రాజు ఈవెంట్ లో స్టేజ్ పై నాగచైతన్యతో ముసి ముసి నవ్వులు నవ్వడంతో సోషల్ మీడియాలో బాగా పాపులరైంది. రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర సినిమాలో సుశాంత్ కి లవర్ గా నటించి తనదైన మార్క్ ను క్రియేట్ చేసింది.

ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన అంద చందాలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. తను షేర్ చేసే ఫొటోలు అలా ఉన్నాయి. దర్శక, నిర్మాతలకు కూడా ఇండస్ట్రీ లో దక్ష నగార్కర్ అనే ఒక హీరోయిన్ ఉంది గుర్తించండి అనే ఉద్దేశం వచ్చేలా ఫోటోలను షేర్ చేస్తుంది. దక్ష నగార్కర్ మంచి నటి అయినప్పటికీ భారీ విజయాన్ని మాత్రం చవిచూడలేదు.
పరిశ్రమలో విజయం సాధిస్తేనే గుర్తింపు లభిస్తుందనే విషయం తెలిసిందే. భారీ చిత్రాల్లో అవకాశాలు రాకపోయినప్పటికీ చిన్న చిన్న చిత్రాల్లో మాత్రం వస్తున్నాయి. కానీ వాటివల్ల రావల్సినంత స్థాయిలో గుర్తింపు మాత్రం రావడంలేదు. ఒక్క క్యారెక్టర్ సరైంది పడితే ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందుతుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications