ప్రముఖ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య ఎఫైర్
సినీ పరిశ్రమలో ప్రేమలు, విడాకులు చాలా సాధారణం. బాలీవుడ్‌లో అయితే ఈ వ్యవహారాలు మరింత బహిరంగంగా జరుగుతుంటాయి. అలాంటి బాలీవుడ్ నటీమణులలో ఒకరైన నటాషా స్టాంకోవిచ్ ఇప్పుడు ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా భార్యగా అందరికీ సుపరిచితమే. అయితే, హార్దిక్ పాండ్యా జీవితంలోకి రాకముందు నటాషా ప్రేమకథ గురించి చాలామందికి తెలియదు.
నటాషా స్టాంకోవిచ్: బాలీవుడ్ ప్రయాణం, ప్రేమ వ్యవహారాలు
సెర్బియాకు చెందిన నటాషా, మొదట కొన్ని రియాలిటీ షోలలో కనిపించింది. 2013లో 'సత్యాగ్రాహ' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో డ్యాన్స్ నంబర్లతో బాగా పాపులర్ అయ్యింది. ఈ సమయంలోనే ఆమె తన వ్యక్తిగత జీవితంలో పలు ప్రేమకథలను కొనసాగించింది.

హార్దిక్‌కు ముందు నటాషా ప్రేమ
హార్దిక్ పాండ్యా కంటే ముందు, నటాషా టీవీ నటుడు అలీ గోనితో చాలా కాలం ప్రేమలో ఉంది. ఈ జంట 'నాచ్ బలియే' అనే డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా కలిసి పాల్గొంది. అయితే, వారి మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో వారు విడిపోయారు. తమ విడిపోవడానికి భిన్నమైన సంస్కృతులు కారణమని వారు అప్పట్లో ప్రకటించారు.
హార్దిక్ పాండ్యాతో కొత్త జీవితం
అలీ గోనితో బ్రేకప్ తర్వాత, నటాషా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చాలాకాలం రిలేషన్‌లో ఉన్న ఈ జంట, కరోనా సమయంలో సైలెంట్‌గా వివాహం చేసుకుంది. పెళ్లికి ముందే నటాషా గర్భవతి కావడంతో, ఎలాంటి హడావుడి లేకుండానే పెళ్లి తంతును ముగించారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, హార్దిక్ కంటే నటాషా వయస్సులో ఏడాదిన్నర పెద్దది కావడం మరో విశేషం.












Click it and Unblock the Notifications