పుట్టిన బిడ్డలను కిడ్నిప్ చేసే బ్యాచ్..ఓటీటీలో అల్లాడిస్తున్న క్రైమ్ థ్రిల్లర్

ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఓ సినిమా సందడి చేయడానికి రెడీ అవుతోంది. విచిత్రం ఏమిటంటే..ఈ సినిమా విడుదలైన ఒక్క రోజులోనే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది.

ఆ సినిమా మరెదో కాదు..'డీఎన్ఏ'.ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ ఫేం అధర్వ మురళి హీరోగా నటించగా, నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటించారు. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను తెలుగులో 'మై బేబీ' అనే టైటిల్‌తో డబ్ చేశారు.

Crime thriller DNA is gaining popularity on OTT

'డీఎన్ఏ' కథ:
ఆనంద్ (అధర్వ మురళి) ప్రేమ విఫలమవడంతో తాగుబోతుగా మారతాడు. ఆ తర్వాత బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న దివ్య (నిమిషా సజయన్)ను పెళ్లి చేసుకుంటాడు. ఆనంద్‌లో మార్పు వచ్చి భార్యతో సంతోషంగా జీవిస్తుంటాడు. దివ్య గర్భవతి అవుతుంది. ప్రసవం తర్వాత తన బిడ్డ మారిపోయిందని దివ్య ఆసుపత్రిలో వాదిస్తుంది. అసలు దివ్య చెప్పింది నిజమేనా? బిడ్డ దొరికిందా లేదా అనేది మిగతా కథ. ఈ చిత్రం 2014లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

సినిమాలో బేబీ కిడ్నాప్ సంఘటన జరిగిన తర్వాత కథనం చాలా వేగంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. బిడ్డను వెతకడానికి చేసే ప్రయత్నాలు, దాని వెనుక ఉన్న నెట్‌వర్క్, విలన్ పాత్ర... ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అథర్వా తన నటనతో ఆనంద్ పాత్రలో జీవించారు. అదేవిధంగా, నిమిషా సజయన్ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించి, ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేశారు.

మొత్తంగా చెప్పాలంటే, 'డీఎన్ఏ' చిత్రం ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్. బలమైన నటన, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి సినిమా అవుతుంది. జియో హట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+