ఓటీటీలోకి బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ..అసలు మిస్ అవొద్దు ..!
ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో క్రైమ్ థ్రిల్లర్లకు చాలా మంచి ఆదరణ లభిస్తోంది. అందువల్లే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కథాంశాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఉత్కంఠభరితమైన కథాంశాలు, ఊహించని మలుపులు, సస్పెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అవుతోంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న "గుడ్ డే" (Good Day) సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్టు 15 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది.
డిఫరెంట్ స్టోరీతో "గుడ్ డే"
ఈ సినిమా కథ ఒక తాగుబోతు వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ఎలా సహాయపడ్డాడు అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. పోర్ణా జేఎస్ మైఖేల్ అందించిన కథ, ఎన్. అరవిందన్ దర్శకత్వం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

నటీనటులు, ఇతర వివరాలు:
ఈ సినిమాలో పృథ్వీరాజ్ రామలింగం, మైనా నందిని, ఆదుకలం మురుగదాస్, కాళి వెంకట్, భగవతి పెరుమాళ్, వేళ రామమూర్తి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. గోవింద్ వసంత అందించిన సంగీతం సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది.
విడుదల వివరాలు:
ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో విడుదలైన "గుడ్ డే" సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ ప్రీమియం ద్వారా ఇంట్లో కూర్చొని ఈ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఎంపిక అవుతుంది.












Click it and Unblock the Notifications