ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే అంతే..దెబ్బకు దిగొచ్చిన నిర్మాత

డాకూ మహారాజ్ పై జూ ఎన్టీఆర్ అభిమానులు అలిగారా? సోషల్ మీడియా లో జరుగుతున్న చర్చ చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం..

జూ ఎన్టీఆర్ అభిమానులకు మోస్ట్ మెమెరబుల్ మూవీ జై లవ కుశ. సర్దార్ గబ్బర్ లాంటి ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ బాబీ కి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టారు ఎన్టీఆర్. వరల్డ్ వైడ్ గా 130 కోట్లు ( గ్రాస్) కలెక్ట్ చేసింది ఆ మూవీ. రీసెంట్ గా జరిగిన అన్ స్టాపబుల్ టాక్ షో లో బాబీ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ప్రస్తావన తీసుకువచ్చిన నందమూరి బాలకృష్ణ... జై లవ కుశ గురించి మాత్రం ఎందుకు అడగలేదు అని నొచ్చుకున్నారు జూ ఎన్టీఆర్ అభిమానులు.

బాబాయ్ మరిచినా బాబీ అయినా చెప్పాల్సింది కదా అంటూ కామెంట్స్ పాస్ చేస్తున్నారు. బాబీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు. ఒక సినిమా కి తాను చాలా అడ్జస్ట్ అవుతూ వర్క్ చేశా అనీ.. సదరు నిర్మాణ సంస్థ సరైన బడ్జెట్ ఇచ్చి ఉంటే ఇంకా బ్రహ్మాండం గా తెరకెక్కించేవాడిని అని బాబీ అన్నారు. ఆ మూవీ జై లవ కుశ... ఆ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అని చాలా మంది ఊహించారు కూడా. ఆ తర్వాత బాబీ ఆ ఊహాగానాలు కొట్టిపారేసారు. కానీ లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక.

Daaku Maharaj Controversy Jr NTR Fans raised Concerns on socialmedia Ahead of Trailer Release

ఇక బాబాయ్ అబ్బాయ్ గురించి మాట్లాడుకుందాం. నందమూరి బాలకృష్ణ ను ఎన్టీఆర్ ను ఓకే వేదిక పై చూద్దామని ఎప్పటి నుండో అభిమానులు కోరుకుంటున్నారు. అలానే బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో లో జూ ఎన్టీఆర్ కూడా వస్తే బాగుంటుంది అని కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ గెస్ట్ గా రావడం సరికదా ... కనీసం అతని ప్రస్తావన..అతని సినిమాల ప్రస్తావన తీసుకురాకపోవడం ఎంతవరకు సబబు అని సోషల్ మీడియా లో జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధని వ్యక్త పరుస్తున్నారు.

అందుకే డాకు మహారాజ్ మూవీ మేము చూడం అని కొంతమంది తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. దీని పై పరోక్షంగా డాకూ మహారాజ్ నిర్మాత నాగ వంశీ కూడా స్పందిస్తూ... " ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వటానికి ప్రయత్నిద్దాం" అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు .

సరే మొత్తానికి ఇదీ సంగతి... కొన్ని గంటల్లో డాకూ మహారాజ్ ట్రెలర్ రిలీజ్ అవుతోంది. అమెరికా లో జనవరి 4 రాత్రి 9. 09 నిమిషాలకు ..భారత్ లో జనవరి 5 ఉదయం 8.39 నిమిషాలకు రిలీజ్ అవుతోంది. గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+