ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న!
టాలీవుడ్‌లో 'మినిమమ్ గ్యారెంటీ' హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్.. వరుసగా ఆరు విజయాల తర్వాత నటించిన సినిమా 'డెకాయిట్'. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న మృణాల్ ఠాకూర్ తోడవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ జోడీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేసిందో చూద్దాం!
కథ
హరిదాస్ (అడివి శేష్) ఓ హత్య కేసులో 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి, పోలీసుల కళ్లు గప్పి పారిపోతాడు. అతనికి దుబాయ్ వెళ్లాలంటే రూ. 60 లక్షలు అవసరం. కానీ అతని లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదు.. తనని జైలు పాలు చేసిన తన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవడం. అయితే ఆమె దగ్గరకు వెళ్లిన హరికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. సరస్వతి భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అతని ఆపరేషన్ కోసం కోటి రూపాయలు కావాలి. పగ తీర్చుకోవాలనుకున్న హరి, ఆమె అవసరాన్ని వాడుకుని ఒక పక్కా ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు, పోలీసుల వేట, విడిపోయిన ప్రేమికుల మధ్య సాగే యుద్ధమే ఈ 'డెకాయిట్'.

ఎలా ఉందంటే?
అడివి శేష్ సినిమాల్లో ఉండే క్లాసిక్ థ్రిల్ కంటే.. ఇందులో మాస్ యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి హీరో జైలు నుంచి తప్పించుకునే వరకు కథ వేగంగా సాగుతుంది. ముఖ్యంగా ట్రైన్ యాక్సిడెంట్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే 'పాలపిట్టరో..' సాంగ్ థియేటర్లో విజిల్స్ వేయిస్తుంది. ద్వితీయార్ధం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల బాగున్నా, మరికొన్ని చోట్ల పాత సినిమాలను గుర్తు చేస్తుంది. క్లైమాక్స్‌లో హీరో చేసే త్యాగం మాత్రం మనసును హత్తుకుంటుంది.
నటీనటుల ప్రతిభ:
హరిదాస్ పాత్రలో అడివి శేష్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారు. మదనపల్లి యాసలో ఆయన చెప్పిన డైలాగులు, యాక్షన్ సీన్స్‌లో ఆయన చూపిన పౌరుషం అద్భుతం. జూలియట్‌గా మృణాల్ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. క్లిష్టమైన భావోద్వేగాలను కళ్లతోనే పండించింది. సీఐ స్వామిగా అనురాగ్ కశ్యప్ తనదైన క్రూరత్వాన్ని చూపించగా.. ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు షానియల్ మేకింగ్ స్టైల్ బాగుంది. భీమ్స్ అందించిన పాటలు హుషారునిస్తాయి, కానీ కొన్ని చోట్ల నేపథ్యం సంగీతం కాస్త లౌడ్‌గా అనిపిస్తుంది. ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ ఇచ్చింది.
ప్లస్ పాయింట్స్:
అడివి శేష్, మృణాల్ పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఇద్దరు తమ మార్క్ యాక్టింగ్‌తో అదరగొట్టారు. భీమ్స్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను సీట్ల అంచుమీద కూర్చోబెట్టాయి. మదనపల్లి యాసలో డైలాగులతో అడివి శేష్ అదరగొట్టాడు.
మైనస్ పాయింట్స్:
ఏ సినిమాలో అయిన చిన్నపాటి మైనస్ పాయింట్లు ఉండటమే సహజమే. కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు సెకండాఫ్‌లో సాగతీత అంశాలు ఉన్నాయి.
చివరిగా.. 'డెకాయిట్'.. పాత కథే అయినా, శేష్ తన యాక్షన్, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించాడు. మాస్ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్. మొత్తానికి ఈ సినిమాతో అడవి శేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నట్టే కనిపిస్తున్నాడు.
రేటింగ్: 3/5
-
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
‘అరవ’ దర్శకులను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ?? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా?












Click it and Unblock the Notifications