దగ్గుబాటి అభిరామ్ పెళ్లి... పెళ్లికూతురు ఆమే
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ ఈ డిసెంబర్లోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాతో అభిరామ్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది.
అభిరామ్ వివాహం డిసెంబర్ 6వతేదీ రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని అందమైన ఫైవ్‌స్టార్ రిసార్ట్ లో(అనంతర కలుతారా) ప్రత్యూష చాపరాలతో గ్రాండ్‌గా జరగనుంది. సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరుగుతుందని.. మొత్తం 200 మంది మాత్రమే హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్లికి వెళ్లే అతిథులు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టనున్నారు. మూడు రోజుల వివాహ వేడుకలు సోమవారం (డిసెంబర్ 4) రాత్రి డిన్నర్ పార్టీతో మొదలు కానున్నాయి. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మొహందీ, తర్వాత విందు కూడా అక్కడే ఉంటుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు పెళ్లికూతురు వేడుక జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 7.00 గంటలకు వివాహ వేడుక ప్రారంభం కానుంది.

రాత్రి 8.50 గంటలకు సుముహూర్తం తర్వాత అందరూ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని తెలుస్తోంది. వచ్చిన తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు, సన్నిహితులు, బంధుమిత్రులు హాజరు కానున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీలో అడుగు పెట్టబోతున్న కోడలు ప్రత్యూష చాపరాల సురేష్‌బాబు కుటుంబానికి చెందిన అమ్మాయే. ప్రకాశం జిల్లాలోని కారంచేడు సొంత ఊరు. సురేష్‌బాబుకు ఆ అమ్మాయి మేనకోడలు అవుతుంది. ఆ కుటుంబానికి వ్యాపారాలతోపాటు భారీగా స్థిర చరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications