Daggubati: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. వివాహం ఎవరికంటే..!
ప్రముఖ నిర్మాత, దివంగత దగ్గుబాటి రామానాయుడు మనవడు, దగ్గుబాటి సురేష్ తనయుడి పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి రానాకు ఇప్పటికే పెళ్లి కావడంతో అతడి తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ కు పెళ్లి చేయాలని సురేష్ బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి ప్రారంభం అయింది. హీరో అభిరామ్ వివాహం తేది కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అభిరామ్ తమ బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
అభిరామ్ తనకు చిన్ననాటి నుంచి తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారట. సురేష్ బాబు చెల్లెలి కూతురుతోనే అభిరామ్ వివాహం జరగబోతుందట. ఇది దివంగత రామానాయుడి కోరిగా తెలుస్తోంది. అభిరామ్ ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డట్లు.. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అభిరామ్ పెళ్లి ఇండియా నిర్వహించడం లేదని తెలుస్తోంది. అభిరామ్ వివాహాన్ని శ్రీలంకలో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

డిసెంబర్ 6న ఈ పెళ్లి జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం శుభలేఖలు కూడా వినూత్నంగా డిజైన్ చేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కారంచేడులో రామానాయుడు కు ఉన్న పాత ఇల్లు డిజైన్‌ను శుభలేఖల మీద అచ్చువేయిస్తున్నారని సమాచారం. దగ్గుబాటి అభిరామ్ అహింస అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత అభిరామ్ సినిమాలు చేయలేదు.
కాగా అభిరామ్ ఓ కాఫీ షాపును ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రామానాయుడు స్టూడియో పక్కనే రైటర్స్ కాఫీ షాప్ ఓపెన్ చేసే పనిలు అభిరామ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అభిరామ్ అన్న రానా పెళ్లి 2020లో మిహికా బజాజ్ తో జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications