దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఫిక్స్... పెళ్లికూతురు ఎవరంటే..!

మూవీమొఘల్ గా పేరుతెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండో కుమారుడైన దగ్గుబాటి హీరో అభిరామ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అహింస సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అభిరామ్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో వెనకబడింది.

తాజాగా దగ్గుబాటి అభిరామ్ కు వివాహం కుదిరినట్లు తెలుస్తోంది. రామానాయుడు తమ్ముడు మనవరాలిని అభిరాం పెళ్లి చేసుకోనున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ ప్రస్తుతం పెళ్లి హడావిడిలో ఉంది. సురేష్ బాబు చెల్లెలి కూతురిని అభిరామ్ వివాహం చేసుకోనున్నారు. పెళ్లి కుమార్తె కుటుంబం ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడులో నివసిస్తోంది. అమ్మాయి ఉన్నత చదువులు చదివింది. చిన్నతనం నుంచి కూడా అభిరామ్ కు ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టమని సమాచారం. డిసెంబరు 6వ తేదీన వీరిద్దరి పెళ్లిన శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేశారు.

daggubati suresh second son abhiram marriage details

పెళ్లి శుభలేఖలను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దగ్గుబాటి కుటుంబంలో వివాహ వేడుక అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి త్వరలో దగ్గుబాటి ఫ్యామిలీ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించబోతోంది. అభిరామ్ త్వరలోనే ఒక కాఫీ షాప్ ను ఓపెన్ చేయనున్నారని తెలుస్తోంది.

రైటర్స్ కాఫీషాప్ పేరుతో ఈ కాఫీషాప్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని, సురేష్ బాబు కూతురు మాళవిక పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. పెళ్లి అయిన తర్వాత కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా జీవితంలో విజయవంతమవ్వాలని రామానాయుడు అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+