దసరా బాక్సాఫీస్ బరిలో ఐదు సినిమాలు.. కానీ అసలు వార్ మాత్రం ఆ ఇద్దరి మధ్యే!

ఈ దసరా పండగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ఐదు సినిమాలు పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాయి. పండగ రేసు చాలా రద్దీగా అనిపించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇది 5 సినిమాల మధ్య జరుగుతున్న పోరు అనడం సరికాదు. అసలు బాక్సాఫీస్ యుద్ధం కేవలం రెండు పెద్ద సినిమాల మధ్యే నెలకొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2', విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'రణబాలి' సినిమాలే ఈ దసరా బరిలో ప్రధాన పోటీదారులుగా నిలిచాయి.

సైకో కిల్లర్ గా మారిన యంగ్ హీరో.. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
సైకో కిల్లర్ గా మారిన యంగ్ హీరో.. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా ఈ రేసు నుంచి తప్పుకోవడంతో దసరా రేసు రూపమే మారిపోయింది. ఒకవేళ ఈ సినిమా వచ్చి ఉంటే దసరా సెలవుల్లో తెలుగు కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడటంతో దసరా మార్కెట్లో 'జైలర్ 2', 'రణబాలి' సినిమాల ప్రాధాన్యత, క్రేజ్ ఒక్కసారిగా మరింత పెరిగాయి.

Dasara Box Office Clash 2026 Jailer 2 vs Ranabaali Fight Begins Read full analysis Here

ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు 'క్రేజీ కల్యాణం', 'గరివిడి లక్ష్మి', 'సమ్మర్ హాలిడేస్' అనే మరో మూడు సినిమాలు కూడా ఇదే పండగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వీటి వ్యాపార స్థాయి, అంచనాలు ఈ రెండు బిగ్ టికెట్ సినిమాలతో పోల్చేలేము. బాక్సాఫీస్‌ను ఏలడం కంటే తమ సినిమాకు తగినన్ని థియేటర్లు, షోలు దక్కించుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమే ఈ మూడు చిత్రాల ముందున్న అసలు సవాలుగా ఉంది.

Jailer 2 Censor Review: రజనీకాంత్ 'జైలర్ 2' సెన్సార్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ లోడింగ్..!!
Jailer 2 Censor Review: రజనీకాంత్ 'జైలర్ 2' సెన్సార్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ లోడింగ్..!!

ఇక్కడే అసలు పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. రజినీకాంత్ మాస్ ఇమేజ్‌తో 'జైలర్ 2' భారీ ఓపెనింగ్స్ సాధించే దిశగా ఉంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తోన్న 'రణబాలి'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండింటికీ భారీ స్థాయిలో థియేటర్లు, ప్రైమ్ షోలు లభించనున్నాయి. కాబట్టి సాంకేతికంగా 5 సినిమాలు బరిలో ఉన్నప్పటికీ.. దసరా బాక్సాఫీస్ అసలు పోరు మాత్రం ఈ రెండు సినిమాల మధ్యే ఉండబోతోంది. మిగిలిన 3 సినిమాలు మిగిలిన థియేటర్ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఏ సినిమా విజయం సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+