Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండస్ట్రీలో చాలామంది 'గే' లు ఉన్నారు.. నా భార్య అందుకే నన్ను వదిలేసింది

సినీ ప్రపంచం నిత్యం కాంట్రవర్సీలు, సంచలన వార్తలకు చిరునామాగా నిలుస్తుంటుంది. నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్‌ను చాలా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించినా, కొన్నిసార్లు వారి నిజాలు బహిరంగమై చర్చకు దారితీస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

1980లలో బాలీవుడ్‌ను ఏలిన మోడల్‌లలో, నటులలో దీపక్ పరాశర్ ఒకరు. 'ONLY VIMAL' షూటింగ్స్ ప్రచారంతో దేశవ్యాప్తంగా ఐకానిక్ స్టార్‌గా ఎదిగిన ఆయన... ఒకానొక దశలో మీడియా చేత ఏకంగా అమితాబ్ బచ్చన్‌కు పోటీదారుగా ప్రచారం చేయబడ్డారు. అయితే, ఆ కాంతులు, గ్లామర్ వెనుక ఆయన జీవితంలో ఎదుర్కొన్న చీకటి సవాళ్లు, ఆర్థిక కష్టాలు, వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెలుగు చూశాయి.

Deepak Parashar s Shocking Confession Wife Left Me for Glamour Took Everything Opens Up on Sexuality Rumours

1976లో 'మిస్టర్ ఇండియా' టైటిల్‌ను గెలుచుకున్న దీపక్ పరాశర్, 'ఇన్సాఫ్ కా తరాజు' (1980), 'నికాహ్' (1982), 'షరాబి' (1984) వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా, 'నికాహ్' చిత్రంలో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే, ఆయన కెరీర్ అనూహ్యంగా మలుపు తిరిగింది. మెల్లిగా అవకాశాలు తగ్గిపోవడంతో, రామ్‌సే సోదరులు దర్శకత్వం వహించిన బీ-గ్రేడ్ హారర్ సినిమాల్లో నటించాల్సి వచ్చింది.

అదే సమయంలో ఆయనకు తీవ్రమైన యాక్సిడెంట్ అయింది, కాలు దాదాపు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది.ఆ ప్రమాదం కేవలం ఆయన కెరీర్‌ను మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాన్ని కూడా దెబ్బతీసింది. ప్రమాదం జరిగినప్పుడు ఆయన భార్య ఎనిమిది నెలల గర్భిణి. 380 కుట్లతో దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన పరాశర్‌కు తన భార్య వైఖరిలో విపరీతమైన మార్పు కనిపించింది. 1987లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

విడాకులకు గల ప్రధాన కారణం తన భార్య మాటలేనని ఆయన వెల్లడించారు. నేను కేవలం గ్లామర్ కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పడంతో షాక్ అయ్యానని, దీంతో తమ బంధంలో విభేదాలు వచ్చాయని దీపక్ చెప్పుకొచ్చారు. దీంతో విడాకులు తీసుకున్నామని ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించారు.విడాకుల అనంతరం ఆమె తన కూతురిని, ఆస్తి మొత్తం తీసుకుని వెళ్లిపోవడంతో దీపక్ ఆర్థికంగా చితికిపోయారని ఆయన తెలిపారు.

Deepak Parashar s Shocking Confession Wife Left Me for Glamour Took Everything Opens Up on Sexuality Rumours

ముందుగా, నేను నా లైంగికతను ఎవరికీ ప్రకటించలేదు. నేను గే కాదు, అస్సలు కాదు. గే కావడం తప్పు కాదు, ఈ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు, వారి కెరీర్‌లు దెబ్బతినలేదని ఆయన స్పష్టం చేశారు.గతంలో 1970ల చివర్లో నటి జీనత్ అమన్‌తో తనకు రొమాంటిక్ సంబంధం ఉందని కూడా ఆయన 2024లో వెల్లడించారు.

అయితే, ప్రేమ , మానవ సంబంధాలపై తన వైఖరిని వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. నేను అందరితో ప్రేమలో పడతాను. లింగభేదం నాకు అడ్డం కాదు. నా దృష్టిలో మనిషి మంచిగా ఉండాలి, హృదయం మంచిగా ఉండాలి, వారు నాతో నిజాయితీగా ఉండాలి. లింగం నా దృష్టిలో తేడా చేయదని ఆయన వివరించారు. ఈ ప్రకటనను గతంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు.

బాలీవుడ్ అత్యంత గ్లామరస్ మోడల్స్‌లో ఒకరిగా కెరీర్ ప్రారంభించి, 2006లో బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కూడా పాల్గొన్న దీపక్ పరాశర్ జీవితం... బయటి ప్రపంచానికి కనిపించే మెరుపులకు, లోపల ఉన్న నిజ జీవిత కష్టాలకు అద్దం పడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+