Deepika Padukone : కల్కి కోసం దీపికా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ పొడుగు కాళ్ల సుందరి. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ఖాన్ సరసన ఆ సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వరుసగా బాలీవుడ్‌లో ప్రాజెక్టులు చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఈ భామ. ఇప్పడు బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఇక, ఈ అమ్మడు పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిపోయింది. గత ఏడాది షారూక్‌ఖాన్‌తో నటించిన పఠాన్ చిత్రం ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే. తాజాగా ఫైటర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్నిసొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దీపికా పదుకొణే ప్రభాస్ సరసన కల్కి2898 AD సినిమాలో నటిస్తోంది. ఇది పాన్ ఇండియా లెవల్లో వస్తున్న చిత్రం. ఇక ఈ సినిమా కోసం దీపికా భారీ రెమ్యూరేషన్ తీసుకున్నట్లు సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడు సహజంగానే ఒక్కోసినిమాకు కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఇంతటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కల్కి సినిమా కోసం హైయెస్ట్ రెమ్యూనరేషన్‌ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కల్కి 2898 AD సినిమా రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది.

ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కల్కి సినిమా కోసం దీపికా పదుకోణే ఏకంగా రూ.20 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది ఆమె కేరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని కూడా తెలుస్తోంది. గతంలో ఈ అమ్మడు నటించిన సినిమాల్లో ఒక్కో సినిమాకు రూ.12 నుండి రూ.15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే, కల్కి సినిమా కోసం మాత్రం రూ.20 కోట్లు తీసుకోవడం ఇప్పడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక, ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ చాలామంది నటిస్తున్నారు. అందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి వారున్నారు. కల్కి చిత్రం మే 9న అభిమానుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications