దీపికా పదుకొనేకు తెలుగులో ఇష్టమైన హీరో
దేశంలోనే స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది. ఇంకా రాణిస్తూనే ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కిలో దీపిక హీరోయిన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది. అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా ఇందులో నటించారు. కల్కి సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. ప్రస్తుతం దీపికా గర్భవతి.
అందరిచేత శభాష్ అనిపించుకుంది
గర్భవతి అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో తను చేసిన వ్యాఖ్యలు మీడియాతోపాటు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. చదువును మధ్యలోనే ఆపేసి మోడలింగ్ రంగాన్ని ఎన్నుకుంది. అమ్మానాన్నను ఎంతమంది విమర్శించినా వారు నన్ను ఒక్క మాట కూడా అనలేదంటూ తన తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపింది. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకే దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసింది. తర్వాత కన్నడ చిత్రం ఐశ్వర్యతో హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది.

ఓం శాంతి ఓంతో మారిపోయిన జీవితం
తెలుగులో సూపర్ హిట్ అయిన మన్మథుడు సినిమాకు రీమేక్ అది. సోనాలిబింద్రే పోషించిన పాత్రను కన్నడంలో దీపికా పోషించారు. ఈ సినిమా తర్వాత తొలి బాలీవుడ్ సినిమా ఓం శాంతి ఓం భారీ విజయాన్ని దక్కించుకుంది. దీంతో దీపికా జీవితం మారిపోయింది. ఆమెకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పింది. మహేష్ బాబు తో పాటు ఈమెకు రానా అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పింది. రానా దీపికాకు క్లోజ్ ఫ్రెండ్ కావడం విశేషం.












Click it and Unblock the Notifications