దీపికా పదుకొనే ఏడాది సంపాదన ఎంతో తెలుసా?
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొనే ఒక వెలుగు వెలుగుతున్నారు. ఈ క్రేజ్ తోనే అన్ని భాషల సినిమాల్లో నటిస్తూ హిట్లు కొడుతోంది. స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా ఈ అమ్మడు తన 38వ పుట్టినరోజును జరుపుకోబోతోంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లాడింది. వివాహమైన తర్వాత కూడా మరింత చురుగ్గా ఉంటూ సంపాదన కూడా భారీగా ఆర్జిస్తోంది.
ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్లలో కూడా నటిస్తోంది. వీటితోపాటు పలు వ్యాపారాల్లోను ఆమె పెట్టుబడి పెట్టారు. వాటిద్వారా కూడా ఆదాయాన్న ఆర్జిస్తున్నారు. ఒక సంవత్సరానికి ఈ అమ్మడు సంపాదన రూ.60 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సినిమాకు రెమ్యునరేషన్ కింద రూ.13 నుంచి రూ.15 కోట్లు అందుకుంటారు. యాడ్స్ కు సంబంధించి రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్లు తీసుకుంటారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన దీపిక వీటిద్వారా కూడా భారీగానే సంపాదిస్తోంది.

దీపికా పదుకొనే గత ఏడాది షారుక్ ఖాన్ తో కలిసి పఠాన్, జవాన్ లతో భారీ విజయాలను అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రభాస్ తో కలిసి కల్కి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఊహకందని విజువల్స్ తో కల్కి ఉండబోతున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. ప్రభాస్, దీపికా పదుకొనేతోపాటు ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ అత్యంత భారీస్థాయిలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ రూ.500 కోట్లు అని చెబుతున్నారు. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications