యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు ముందే రానున్న సంక్రాంతి
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు.
యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది మూవీ. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా ఇదే. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఎక్స్‌పెక్ట్ చేస్తోన్నారు అభిమానులు. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ (Devara firstlook) హైప్ క్రియేట్ చేసింది. భైరవగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
2024 ఏప్రిల్ 5వ తేదీన ఫస్ట్ పార్ట్ ఈ విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ తేదీ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సినిమా యూనిట్ కష్టపడుతోంది. ఆర్ఆర్ఆర్ తరువాత అంతకుమించిన స్థాయిలో ఉండేలా దేవరను తీయాలనే ఉద్దేశంలో చిత్రం యూనిట్ ఉంది.
దేవరపై ఈ మధ్యకాలంలో ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. డెవిల్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా కల్యాణ్ రామ్ దీనిపై ఓ ప్రకటన చేశారు. ఓ మంచి ప్రొడక్ట్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని తపన పడుతున్నామని, విజువల్స్ కోసం చాలా టైమ్ పడుతోందని, ఆర్ఆర్ఆర్, బింబిసారలాగ దేవర సినిమాతో ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తామని అన్నాడు.
తాజాగా మరో అప్ డేట్ వచ్చింది దేవర యూనిట్ నుంచి. ఫస్ట్ గ్లింప్సెస్ (Devara glimpses)ను విడుదల చేయడానికి ముహూర్తాన్ని ఖరారు అయింది. జనవరి 8వ తేదీన దేవర గ్లింప్లెస్ విడుదల కానున్నాయి. దీనితో పాటు ఓ షార్ట్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ ఆఫ్ దేవర (World of Devara) దీన్ని విడుదల చేయనుంది యూనిట్.












Click it and Unblock the Notifications