'దేవర' యూఎస్ రివ్యూ... ఉమైర్ సంధు రివ్యూ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులను పలకరించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ కథానాయికగా నటించింది. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించగా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితర సీనియర్లంతా నటించారు. ఈ సినిమాను ఓవర్సీస్ లో ఎగ్జిబిటర్లకు షో వేసి చూపించారు. అంతేకాకుండా ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు కూడా దీనిపై రివ్యూ ఇచ్చారు.

అద్భుతమైన నటన
ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని, అద్భుతమైన పాత్రతో, అద్భుతమైన నటనతో సోలో హీరోగా కమ్ బ్యాక్ ఇచ్చాడని, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్రలో సూపర్ హిట్ అయ్యారని, పోటాపోటీగా వీరిద్దరి నటన సినిమా పెద్ద ఆస్తిలాంటిదని ఉమైర్ చెప్పాడు. ఈ సినిమాలో తారక్ లుక్ చాలా బాగుందని, తన అద్భుతమైన నటనతోనే అందరినీ కట్టిపడేస్తాడని, సైఫ్ అలీఖాన్ ఫామ్ లోకి వచ్చాడని, ఈ సినిమా తర్వాత చాలా బిజీగా మారతాడని, యాక్షన్ సన్నివేశాల్లో గతంలో ఎన్నడూ చూడని సైఫ్ ను చూస్తామని, దుమ్ము రేపేశాడన్నారు.

devara movie america review and film critic umair sandhu review

సముద్రంలో సన్నివేశాలు హైలైట్
సినిమా కథ సాధారణంగానే ఉన్నప్పటికీ కొరటాల శివ మాత్రం తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడని, అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. అయితే సినిమాలో జాన్వీకపూర్ పాత్ర సెట్ అవలేదని, కథ మధ్యలో ఇరికించినట్లుగా అనిపించిందని ఉమైర్ సంధు రాసుకొచ్చారు. అలాగే ఓవర్సీస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్టుకానీ అదిరిపోతాయంటున్నారు. షార్క్ తో చేసే ఫైట్ తెలుగులోనే కాదని, ఇండియాలోనే ఇంతవరకూ ఎవరూ చూడని రీతిలో ఉంటుందన్నారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అని, సముద్రంలో వచ్చే సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+