స్లో పాయిజన్‌లా ఎక్కేస్తున్న 'దేవర'

సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా దేవరకు సంబంధించిన వార్తలే కనపడుతున్నాయి.. వినపడుతున్నాయి. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అభిమానులైతే భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదటి షో వేసిన తర్వాత మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమాకు ముందు విపరీతమైన హైప్ తెచ్చిన అభిమానులు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారంటూ సాధారణ సినీ ప్రియులు సందేహపడ్డారు. అయితే మూడు షోలు పడిన తర్వాత మాత్రం ఈ సినిమాకు స్పందన మారుతూ వస్తోంది.

అంచనాలు లేకుండా సినిమాకు వెళ్లాలి
మొదటిరోజు దాదాపుగా అభిమానులతోనే థియేటర్లు నిండిపోతాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు వారిని మెప్పించలేకపోవచ్చు. ఏ సినిమాలోనైనా, ఏ హీరోకైనా ఇది సహజంగా జరుగుతుంటుంది. అయితే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్లి చూస్తే మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందంటున్నారు. దర్శకుడు కొరటాల శివ కూడా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్లండని చెబుతున్నారు. కుటుంబ ప్రేక్షకుల నుంచి సినిమా బాగుందనే టాక్ వస్తుండటం దేవరకు ప్లస్ పాయింట్ అయింది. లాంగ్ రన్ లో మంచి రికార్డులను నెలకొల్పుతుందంటున్నారు.

Devara movie is getting good response from family audience

రెండురోజులు గడిస్తే తెలుస్తుంది
మొదటి భాగంలో ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలతో మెరుపులా అయిపోయింది. రెండో భాగం మాత్రం బాగా సాగదీసినట్లనిపించింది. అయితే ఈ టాక్ సాయంత్రానికి మారింది. రికార్డులు కొల్లగొడతామని అభిమానులు చెబుతున్నారు. అలాగే అనిరుధ్ సంగీతం బాగుందని, ఆచార్య తర్వాత మంచి సినిమానే కొరటాల తీశాడని చెబుతున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి రికార్డులను నెలకొల్పుతుందంటున్నారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా కుటుంబ ప్రేక్షకులే సినిమా థియేటర్ కు వెళతారని, వారికి కచ్చితంగా నచ్చుతుందని, దీంతో సినిమా మరింత కలెక్షన్లు కొల్లగొడుతుందంటున్నారు. ఏదేమైనప్పటికీ మరో రెండురోజులు గడిస్తే సినిమా అసలు పరిస్థితి తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+