జూనియర్ ఎన్టీఆర్ కొంప ముంచిన కొరటాల శివ!

కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో.. అప్పటి నుంచి తారక్ కెరీర్ లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేవర సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది.. అంతేకాదు.. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సింది కూడా వాయిదా పడింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉండగా అది కూడా కొరటాల చేతికి వచ్చింది.

ఇలాంటివి మార్పులు చాలా జరిగాయి. 2024 ఏప్రిల్ 5న దేవర సినిమా విడుదలవుతుందిలే అని అభిమానులు అనుకుంటున్న తరుణంలో ఆరోజు విడుదలయ్యేది కేవలం పార్ట్1 అని, పార్ట్ 2 కూడా ఉందంటూ కొరటాల బాంబు పేల్చాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రావడంవల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదుకానీ జూనియర్ లైనప్ మాత్రం చెల్లాచెదురైంది. దీంతో తర్వాత ఏ సినిమాలు చేయాలి అనే విషయంలో అంతా అయోమయమే.

devara two parts create confusion

వాస్తవానికి దేవర షూటింగ్ ను నవంబరుకల్లా పూర్తిచేసి డిసెంబరు నుంచి వార్ 2 షూటింగ్ లో పాల్గొందాని తారక్ నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినమా చేయాల్సి ఉంది. అయితే దేవర రెండు భాగాల ప్రకటనతో జూనియర్ తర్వాత సినిమా ఏమిటి? అనే చర్చ ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది. దేవర సినిమా ఎన్టీఆర్ 30 అయితే 31 ఏసినిమా అవుతుంది? వార్ 2 అవుతుందా? దేవర 2 అవుతుందా? ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అవుతుందా? 30వ ప్రాజెక్టు అదైతే ఇది ఎంతవుతుంది? 31వ ప్రాజెక్టు అదైతే ఇది ఎంతవుతుంది? అంటూ చర్చలు నడుస్తున్నాయి. దేవర తర్వాత సెట్స్ మీదకు వెళ్లే సినిమా ఏది? అంటే వార్ 2 అంటున్నారు. మరి ఎన్టీఆర్ 31 వార్ 2 అయితే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఏమవుతుంది? ఏదన్నాకానీ ఒక్క ప్రకటనతో కొరటాల శివ జూనియర్ లైనప్ ను కకావికలు చేసేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+