'తండేల్'ను నిలబెట్టింది నాగ చైతన్య కాదు అతనే.. లేదంటే సినిమా గల్లంతే.. !
అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జాలరి పాత్రలో నాగ చైతన్య కనిపించగా, అతన్ని ప్రేమించే పాత్రలో సాయి పల్లవి నటించారు. గాఢంగా ప్రేమించుకున్న జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది 'తండేల్' కథ.
ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు జోడించారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయి. అదే విధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగ చైతన్య నటించారు. సెంకడాఫ్‌లో సినిమా కాస్తా స్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చివర 20 నిమిషాల సినిమాను తన దర్వకత్వంతో కట్టిపడేశాడు చందు మొండేటి.ఇదింతా ఒక ఎత్తు అయితే, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం మరో ఎత్తు.

ఈ తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్‌గా నిలిచారు.ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ సినిమా ఇదే. పుష్ప-2ను మించిన మ్యూజిక్ ఈ తండేల్‌కు దేవీ శ్రీ అందించాడు.ఈ సినిమా విడుదలకు ముందు వరకు దేవి శ్రీ ప్రసాద్‌పై ఎన్నో విమర్శలు వినిపించాయి. ఈ సినిమాకు ఎందుకు దేవి శ్రీ ప్రసాద్‌ను తీసుకున్నారనే కామెంట్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ప్రేమకథలకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ మరో లేవల్లో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.
దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌లోని మ్యాజిక్‌ను బయటపెట్టారు. తండేల్ సినిమాకు ఆయనే అసలైన హీరో.నేపథ్య సంగీతంతో కథలో లీనం అయ్యేలా చేయడంలో దేవి శ్రీ ప్రసాద్ పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా సెంకడాఫ్‌ను తనదైన మ్యూజిక్ కట్టిపడేశాడు.ఈ సినిమా హిట్ వెనుక దేవి శ్రీ ప్రసాద్ కృషి ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. దేవి శ్రీ ప్రసాద్ లేకపోతే ఈ సినిమా లేదనే చెప్పాలి.












Click it and Unblock the Notifications