దేవర విషయంలో తప్పు జరిగిందా?: చెప్పొద్దన్న ఎన్టీఆర్: అసలు విషయం లీక్ చేసిన కల్యాణ్ రామ్
Devil trailer: నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం.. డెవిల్. పీరియాడికల్ థ్రిల్లర్. అతని సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. సత్య, మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. అభిషేక్ నామా దర్శకుడు. ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
అభిషేక్ నామా, దేవాన్ష్ నామా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్ రామ్ నటించాడిందులో. ఓ డార్క్ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి కిందటే లాంచ్ అయింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిందీ మూవీ. అమిగోస్ డిజాస్టర్ తరువాత కల్యాణ్ రామ్ నుంచి వస్తోన్న సినిమా ఇదే. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, కొన్ని ట్విస్టులు.. సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బ్రిటీష్ ఏజెంట్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు కల్యాణ్ రామ్.
ట్రైలర్ లాంచ్ సందర్శంగా కల్యాణ్ రామ్ మాట్లాడాడు. బింబిసార సీక్వెల్ తీయబోతోన్నామని ప్రకటించాడు. బింబిసార 2 త్వరలో సెట్స్‌పైకి వెళ్తుందని తెలిపాడు. వచ్చే ఏడాది లేదా మేలో బింబిసార 2 నిర్మాణ పనులు మొదలవుతాయని, శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తామని అన్నాడు.

ఇదే ఈవెంట్‌లో దేవర గురంచీ అప్‌డేట్ ఇచ్చాడు కల్యాణ్ రామ్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత అంతకుమించిన స్థాయిలో సినిమా తీయాలనే ఉద్దేశంలో చిత్రం యూనిట్ ఉందని అన్నాడు. దేవర గురించి మాట్లాడొద్దని జూనియర ఎన్టీఆర్ చెప్పాడని అంటూనే దీని వివరాలను బయటపెట్టాడు.
ఆర్ఆర్ఆర్ తరువాత మళ్లీ దానికి మించిన సినిమా తీయాలంటే నటుడు, దర్శకుడు, ఒక ప్రొడక్షన్ హౌస్‌కు గానీ ఎంతో బాధ్యత ఉంటుందని అన్నాడు. విజువలైజేషన్‌లో గానీ, కథలో గానీ, తప్పు జరిగిందంటే ప్రేక్షకులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తెలిసి తప్పు చేయమని వివరణ ఇచ్చాడు.
ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డామనేది తమకు తెలుసునని, ఒక మంచి ప్రొడక్ట్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని తపన పడుతున్నామని అన్నారు. సినిమా చూసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ గోల చేయాలని వ్యాఖ్యానించాడు. త్వరలోనే గ్లింప్స్ రాబోతోన్నాయని, దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయని చెప్పాడు.
విజువల్స్ కోసం చాలా టైమ్ పడుతోందని, ఆర్ఆర్ఆర్, బింబిసారలాగ దేవర సినిమాతో ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తామని అన్నాడు. దయచేసి ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశాడు. త్వరలోనే గ్లింప్లెస్ డేట్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నాడు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications