టాలీవుడ్ లో హీరోయిన్ గా టీమిండియా స్టార్ ప్లేయర్ మాజీ భార్య డెబ్యూ
ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ కథానాయికగా వెండితెరకు పరిచయం కానున్నారు. టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఫిల్మ్ ద్వారా ఆమె తన నటనా ప్రయాణాన్ని ఆరంభించబోతోన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదలైంది కూడా. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ధనశ్రీ.. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
ధనశ్రీ వర్మ.. మరెవరో కాదు. టీమిండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య. 2020 డిసెంబర్ 22వ తేదీన వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత మనస్పర్థలొచ్చాయి. నాలుగున్నరేళ్ల తర్వాత విడిపోయారు. 2025 మార్చిలో వారికి ముంబై ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో తన కేరీర్ పై దృష్టి పెట్టారు ధనశ్రీ. కోరియోగ్రాఫర్ గా, కంటెంట్ క్రియేటర్ గా, ఇన్ ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమా పేరు.. 'హే కన్నమ్మ'. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నాయి. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ ఇది. ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఓ సెన్సిటివ్ ప్రేమకథా చిత్రం ఇది. మ్యూజిక్ కు ఈ కథలో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ధనశ్రీ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రానికి శశికుమార్ ముత్తులూరి దర్శకత్వం వహిస్తున్నారు. కథను కూడా ఆయనే సమకూర్చుకున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ కింద హర్షిత రెడ్డి, హన్షిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. జై క్రిష్ నేపథ్యాన్ని సంగీతాన్ని అందిస్తోన్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ కావడం, టీజర్ సైతం ఆకట్టుకుంటోడటం వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కొత్త తరహా కథలు, యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది.












Click it and Unblock the Notifications
